తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​లో ఆసీస్ క్రికెటర్లు ఆడేది అనుమానమే! - sports news

ఈ ఏడాది ఐపీఎల్​లో ఆసీస్ క్రికెటర్లు పాల్గొనే విషయం సందిగ్ధంలో పడింది. ఇప్పటివరకు ఆ దేశ బోర్డు, సదరు ఆటగాళ్లకు ఎన్​ఓసీలు ఇవ్వకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.

ఐపీఎల్​లో ఆసీస్ క్రికెటర్లు ఆడేది అనుమానమే!
పాట్ కమిన్స్

By

Published : Mar 17, 2020, 12:22 PM IST

Updated : Mar 17, 2020, 1:19 PM IST

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కారణంగా పలు టోర్నీలు రద్దవగా, మరికొన్ని వాయిదా పడుతున్నాయి. ఈనెల 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్.. వచ్చే నెల 15 నుంచి మొదలు కానుంది. అయితే ఇందులో ఆస్ట్రేలియా క్రికెటర్లు పాల్గొనేది లేనిది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ ఇదే జరిగితే ఫ్రాంఛైజీల నుంచి వారికి రావాల్సిన మిలియన్ డాలర్లు కోల్పోవాల్సి వస్తుంది.​ భారత్ వెళ్లేందుకు, క్రికెటర్లకు నిరభ్యంతర పత్రం(ఎన్​ఓసీ) ఇచ్చే విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) పునరాలోచనలో ఉంది.

ఆసీస్ క్రికెటర్లకు ఎన్​ఓసీ ఇవ్వకపోతే?

ఒకవేళ ఆసీస్ క్రికెట్ బోర్డు.. తమ ఆటగాళ్లకు ఎన్​ఓసీ ఇవ్వకపోతే, ఐపీఎల్​ ఫ్రాంఛైజీల నుంచి వారికి వేలంలోని డబ్బులు ఇవ్వకపోవచ్చు. భారీ ధర పలికిన పాట్ కమిన్స్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్​వెల్​ లాంటి వారికి ఇది ఆర్థికంగా నష్టమే!

ఐపీఎల్​లో ఆడుతున్న డేవిడ్ వార్నర్(పాత చిత్రం)

గతేడాది డిసెంబరులో జరిగిన ఐపీఎల్​ వేలంలో కమిన్స్​ను రూ.15.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది కోల్​కతా నైట్​రైడర్స్. విదేశీ ప్లేయర్లలో ఇప్పటివరకు ఇదే అత్యధిక మొత్తం. మరోవైపు మ్యాక్స్​వెల్​ను రూ.10.75 కోట్లు పెట్టి కొనుక్కుంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్.

Last Updated : Mar 17, 2020, 1:19 PM IST

ABOUT THE AUTHOR

...view details