తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​తో సిరీస్​లో స్వదేశీ జెర్సీలతో ఆసీస్ - మిచెల్​ స్టార్​ కొత్త జెర్సీ

భారత్​తో ద్వైపాక్షిక సిరీస్​ ఆడటానికి క్రికెట్​ ఆస్ట్రేలియా సన్నద్ధమవుతోంది. ఈ పర్యటనలో భాగంగా జరగనున్న టీ20 సిరీస్​ కోసం ఆసీస్​ ఆటగాళ్లు ప్రత్యేకంగా తయారు చేసిన స్వదేశీ జెర్సీలను ధరించనున్నారు. ఈ కొత్త జెర్సీని క్రికెట్​ ఆస్ట్రేలియా బుధవారం ఆవిష్కరించింది.

Australian men's team to wear Indigenous jersey in T20s against India
భారత్​తో టీ20 సిరీస్​ కోసం స్వదేశీ జెర్సీలు

By

Published : Nov 11, 2020, 5:50 PM IST

టీమ్​ఇండియాతో జరగబోయే టీ20 సిరీస్​కు ఆస్ట్రేలియా జట్టు సన్నద్ధమవుతోంది. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించడానికి ఆసీస్​ ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా స్వదేశీ జెర్సీలను తయారు చేశారు. ఈ కొత్త జెర్సీలను క్రికెట్​ ఆస్ట్రేలియా బుధవారం ఆవిష్కరించింది.

జెర్సీని ధరించిన ఆస్ట్రేలియా పేసర్​ మిచెల్ స్టార్క్​.. కొత్త జెర్సీతో బరిలో దిగడంపై సంతోషం వ్యక్తం చేశాడు. "మా మొట్టమొదటి స్వదేశీ జెర్సీని ధరించేందుకు మేమెంతో ఉత్సుకతతో ఉన్నాం" అని స్టార్క్​ పేర్కొన్నాడు.

భారత్​, ఆస్ట్రేలియా మధ్య నవంబరు 27 నుంచి ద్వైపాక్షిక సిరీస్​ ప్రారంభం కానుంది. ముందుగా మూడు వన్డేలు, ఆ తర్వాత మూడు టీ20లు, నాలుగు టెస్టులను ఆడనున్నారు. డిసెంబరు 4న టీ20 సిరీస్​ ప్రారంభం కానుంది.

ABOUT THE AUTHOR

...view details