తెలంగాణ

telangana

ETV Bharat / sports

వన్డే, టీ20లో హ్యాట్రిక్​ సాధించిన ఏకైక క్రికెటర్ - Megan Schutt

వన్డే, టీ20లో హ్యాట్రిక్ సాధించిన తొలి మహిళా క్రికెటర్​గా రికార్డు సృష్టించింది ఆసీస్ పేసర్ మేగాన్ షూట్. వెస్టిండీస్​తో జరిగిన మ్యాచ్​లో ఈ ఘనత సాధించింది.

మేగాన్

By

Published : Sep 13, 2019, 6:15 AM IST

Updated : Sep 30, 2019, 10:15 AM IST

ఆస్ట్రేలియా పేసర్ మేగాన్ షూట్ అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనత సాధించింది. పరిమిత ఓవర్ల క్రికెట్లో రెండు ఫార్మాట్లలో హ్యాట్రిక్ సాధించిన తొలి మహిళా క్రికెటర్​గా రికార్డు సృష్టించింది. వెస్టిండీస్​తో జరిగిన మూడో వన్డేలో వరుస బంతుల్లో ముగ్గురిని పెవిలియన్ చేర్చింది. ఆసీస్ తరఫున వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి క్రీడాకారిణిగానూ గుర్తింపు పొందింది.

ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్​ 180 పరుగులకే పరిమితమైంది. మేగాన్ 10 ఓవర్ల కోటాలో 9.3 ఓవర్లకు ఒక్క వికెటూ సాధించలేదు. కానీ చివరి ఓవర్ చివరి మూడు బంతుల్లో హ్యాట్రిక్ సాధించింది.

వన్డేల కంటే ముందు టీ20లో హ్యాట్రిక్ సాధించింది మేగాన్. గతేడాది మార్చిలో టీమిండియాతో జరిగిన మ్యాచ్​లో వరుసగా స్మృతి మందణ్న, మిథాలీ రాజ్, దీప్తి శర్మలను పెవిలియన్ పంపింది.

ఇవీ చూడండి.. అవన్నీ పుకార్లే : ధోనీ భార్య సాక్షి సింగ్

Last Updated : Sep 30, 2019, 10:15 AM IST

ABOUT THE AUTHOR

...view details