తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టెస్టుల్లో 400 కోసం మరో అవకాశం కావాలి' - వార్నర్​ 400

ఆస్ట్రేలియా ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​.. ఇటీవల కెరీర్​లో తొలిసారి టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. పాకిస్థాన్​తో జరిగిన పోరులో 335 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్​లో లారా టెస్టు రికార్డు(400*) బ్రేక్​ చేయలేకపోవడంపై స్పందించాడు వార్నర్​.

Hoping for another chance to knock 400 off: David Warner after catching up with Brian Lara
'టెస్టుల్లో 400 కోసం మరో అవకాశం కావాలి'

By

Published : Dec 4, 2019, 12:41 PM IST

ఆస్ట్రేలియా​ ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​... అడిలైడ్​ వేదికగా ఇటీవల పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో 335 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. అయితే ఆ మ్యాచ్​లో వార్నర్​ దూకుడు మీద ఉన్నప్పుడు కంగారూ జట్టు కెప్టెన్​ టిమ్​ పైన్​ డిక్లేర్​ ప్రకటించాడు. ఈ నిర్ణయంపై క్రికెట్​ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకంటే టెస్టుల్లో అత్యధిక స్కోరైన లారా రికార్డు(400*)ను వార్నర్​ బద్దలు కొట్టేస్తాడని అంతా అనుకున్నారు. తాజాగా ఈ అంశంపై స్పందించిన వార్నర్​.. లారాతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.

ఈ మ్యాచ్​ చూడటానికి లారా స్టేడియానికి రావడం విశేషం. ఆట ముగిసిన తర్వాత ఈ విండీస్ దిగ్గజాన్ని కలిసిన వార్నర్​.. ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నాడు.

దిగ్గజ క్రికెటర్​ లారాతో వార్నర్​

" దిగ్గజ ఆటగాడిని కలవడం నిజంగా సంతోషం. ఏదో ఒకరోజు అతడి(లారా) 400 పరుగుల రికార్డును బ్రేక్​ చేసే అవకాశం వస్తుందని అనుకుంటున్నా"
- డేవిడ్​ వార్నర్​, ఆస్ట్రేలియా క్రికెటర్​

16 ఏళ్లుగా అదే రికార్డు..

1957-58 కాలంలో 365* పరుగులు చేసి తొలిసారి టెస్టుల్లో అత్యధిక​ స్కోరు నమోదు చేశాడు దిగ్గజ విండీస్​ ఆటగాడు గార్​ఫీల్డ్​​ సోబర్స్. ఆ తర్వాత 1993-94లో 375 రన్స్​ చేసి ఆ రికార్డును బ్రేక్​ చేశాడు లారా. మళ్లీ 2003-04లో టెస్టుల్లో ఎవరికీ సాధ్యం కాని విధంగా 400* పరుగులతో రికార్డు నెలకొల్పాడీ విండీస్ దిగ్గజం.

అనంతరం ఆసీస్​ మాజీ ఆటగాడు మాథ్యూ హెడెన్​ (380), శ్రీలంక మాజీ బ్యాట్స్​మన్​ జయవర్దనే (374) వంటి ఎందరో ప్రయత్నించినా... లారా రికార్డు బ్రేక్​ చేయలేకపోయారు. దాదాపు 16 ఏళ్లుగా ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది.

ABOUT THE AUTHOR

...view details