ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్.. తన తొలి టెస్టులో ఉపయోగించిన క్యాప్‌ను మంగళవారం వేలం వేశారు. ఆస్ట్రేలియా వ్యాపారవేత్త పీటర్ ఫ్రీడ్మన్ రూ.2.51 కోట్లు చెల్లించి, వేలంలో ఈ టోపీని సొంతం చేసుకున్నారు. క్రికెట్ జ్ఞాపికల వేలంలో అత్యధిక ధర పలికిన రెండో వస్తువుగా ఈ బాకీ క్యాప్ నిలిచింది.
భారీ ధర పలికిన జ్ఞాపికలు
రోడ్ మైక్రోఫోన్స్ సంస్థను స్థాపించిన పీటర్ ఫ్రీడ్మన్.. గతంలో అమెరికన్ సింగర్ కర్ట్ కోబెన్ గిటార్‌ను రూ. 50.28 కోట్లకు వేలంలో దక్కించుకున్నారు. 1928 నాటి బ్రాడ్‌మన్ క్యాప్‌ను సొంతం చేసుకున్నారు. గతేడాది వేలంలో ఆసీస్ దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ టెస్టు క్యాప్ రూ. 5.62 కోట్లకు అమ్ముడుపోయింది. క్రికెట్ జ్ఞాపికల వేలంలో అత్యధిక ధర పలికిన తొలి వస్తువు ఇదే కావడం విశేషం. ఆ తర్వాత బ్రాడ్‌మన్ క్యాప్ రెండో స్థానంలో నిలిచింది.
ఆస్ట్రేలియాకు 20 ఏళ్లపాటు (1928-48) ప్రాతినిధ్యం వహించిన బ్రాడ్‌మన్.. 52 టెస్టులుఆడారు. 1949లో కెరీర్‌కు వీడ్కోలు పలికిన ఆయన.. 99.94 బ్యాటింగ్ సగటు నమోదు చేసిన రికార్డుల్లోకెక్కారు.
ఇదీ చూడండి:300 వారాల పాటు 'నంబర్‌వన్'గా జకోవిచ్