ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌కు భారత్ అంటే చాలా ఇష్టం. చాలా సందర్భాల్లో ఆ విషయాన్ని ప్రస్తావించాడు. ఇటీవల భారత సంతతి అమ్మాయి విని రామన్‌ను ప్రేమిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. శనివారం మనదేశ సంప్రదాయంలోనే ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెట్టింట వైరల్‌గా మారాయి. క్రికెట్ అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇద్దరూ భారతీయ వస్తధారణలో తీసుకున్న ఫొటోలపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
భారతీయ సంప్రదాయంలో మ్యాక్స్‌వెల్ నిశ్చితార్థం - Glenn Maxwell latest news
ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. భారత సంతతికి చెందిన విని రామన్‌తో తాజాగా భారతీయ సంప్రదాయంలో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా.. అభిమానులు విపరీతంగా స్పందిస్తున్నారు.
భారతీయ సంప్రదాయంలో మ్యాక్స్‌వెల్ నిశ్చితార్థం
మానసిక సమస్యలతో కొద్దిరోజులు క్రికెట్‌కు దూరంగా ఉన్న గ్లెన్ మాక్స్‌వెల్.. తర్వాత బిగ్‌బాష్ లీగ్‌లో అదరగొట్టేశాడు. అంతేకాకుండా ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. కానీ కరోనా వైరస్ కారణంగా మార్చి 29న ప్రారంభంకావాల్సిన ఐపీఎల్.. ఏప్రిల్ 15కి వాయిదా పడింది. గతేడాది డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ వేలంలో.. ఇతడిని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ ఏకంగా రూ. 10.75 కోట్లకి కొనుగోలు చేసింది.