తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆస్ట్రేలియా, జింబాబ్వే వన్డే సిరీస్​ వాయిదా - Cricket Australia

ఆగస్టులో ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య జరగాల్సిన మూడు వన్డేల సిరీస్​ వాయిదా పడింది. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఆటగాళ్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఇరు దేశాల క్రికెట్​ బోర్డులు ప్రకటించాయి.

Australia-Zimbabwe ODI series postponed due to COVID-19 pandemic
ఆస్ట్రేలియా, జింబాబ్వేల వన్డే సిరీస్​ వాయిదా

By

Published : Jun 30, 2020, 11:43 AM IST

ఆస్ట్రేలియా, జింబాబ్వే మధ్య ఆగస్టులో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్​ను వాయిదా వేస్తున్నట్లు ఇరుదేశాల క్రికెట్​ బోర్డులు ప్రకటించాయి. ఆస్ట్రేలియాలో కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల ఈ పరిస్థితుల్లో క్రీడా టోర్నీలు పునఃప్రారంభించడం కష్టమని తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో ఇప్పటికే 7,836 కేసులు నమోదు కాగా 104 మంది మరణించారు.

"ఈ సిరీస్​ వాయిదా వేయడం మాకు నిరాశగా ఉన్నప్పటికీ.. ఆటగాళ్లు, మ్యాచ్​ అధికారులు, వాలంటీర్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. రీషెడ్యూల్​ను త్వరలో ప్రకటిస్తాం".

- నిక్​ హాక్లే, క్రికెట్​ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓ

"ఆస్ట్రేలియాతో ఆడటానికి మేమెంతో ఆసక్తిగా ఉన్నాం. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పర్యటన జరిగే వీలులేదు. ఏదేమైనా ఈ టూర్​ను రీషెడ్యూల్​ చేసి ముందుకు తీసుకెళ్లడానికి పరిశీలన చేస్తున్నాం" అని జింబాబ్వే క్రికెట్​ జట్టు మేనేజర్​ గివ్​మోర్ మకోని వెల్లడించారు.

2003-04లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్​ తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ జట్టుతో ద్వైపాక్షిక సిరీస్ కోసం ఆసీస్​ పర్యటనకు జింబాబ్వే వెళ్లాల్సి ఉంది.

ఇదీ చూడండి...'పాకియతాన్'​తో ట్రోల్స్​ ఎదుర్కొంటున్న పీసీబీ

ABOUT THE AUTHOR

...view details