తెలంగాణ

telangana

ETV Bharat / sports

కివీస్ జట్టు వైట్​వాష్.. ఆసీస్​దే వన్డే సిరీస్​ - క్రికెట్ న్యూస్

మూడో వన్డేలోనూ గెలిచిన ఆసీస్ మహిళా జట్టు.. తన రికార్డును పదిలం చేసుకుంది. దీంతో పాటే సిరీస్​ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది.

Australia women stretch unbeaten record
కివీస్ జట్టు వైట్​వాష్.. ఆసీస్​దే వన్డే సిరీస్​

By

Published : Apr 10, 2021, 6:40 PM IST

ఆస్ట్రేలియా మహిళా జట్టు తమ విజయపరంపరను కొనసాగించింది. న్యూజిలాండ్​తో శనివారం జరిగిన మూడో వన్డేలోనూ విజయం సాధించి, సిరీస్​ను సొంతం చేసుకుంది. దీంతో వరుసగా 24 మ్యాచ్​లు గెలిచి, అంతర్జాతీయంగా ఎక్కువ మ్యాచ్​ల్లో గెలిచిన జట్టుగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.

వర్షం కారణంగా తలో 25 ఓవర్లకు కుదించిన ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. అలీసా హేలీ(46), బెత్ మూనీ(28), జార్జియా వేర్​హమ్(18*) తమ వంతు ప్రదర్శన చేశారు.

ట్రోఫీతో ఆసీస్ కెప్టెన్

ఛేదనలో కివీస్ బ్యాట్స్​ఉమెన్ అమీ సెటర్త్​వైట్​ 20, లే తాహ్యుహ్యూ 21 పరుగుల మినహా మిగిలిన వారందరూ విఫలమయ్యారు. దీంతో నిర్ణీత ఓవర్లలో 128/9​ పరుగులే చేయగలిగింది.

ఇది చదవండి:వన్డేల్లో ఆసీస్​ మహిళా జట్టు అదిరే రికార్డు

ABOUT THE AUTHOR

...view details