తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాకిస్థాన్​పై ఆస్ట్రేలియా గెలుపు.. టీ20 సిరీస్​ కైవసం - పాకిస్థాన్​Xఆస్ట్రేలియా టీ20

పాకిస్థాన్​పై మూడో టీ20లో ఆస్ట్రేలియా సునాయాస విజయం సాధించింది. 10 వికెట్ల తేడాతో గెలిచిన కంగారూలు... టీ20 సిరీస్​ను 2-0 తేడాతో కైవసం చేసుకున్నారు. తొలి మ్యాచ్​ వర్షం కారణంగా రద్దయింది.

పాకిస్థాన్​పై టీ20 సిరీస్​ గెలిచిన ఆస్ట్రేలియా

By

Published : Nov 8, 2019, 6:05 PM IST

పాకిస్థాన్ క్రికెట్ జట్టు మరో సిరీస్​లో ఓడిపోయింది. టీ20ల్లోప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న పాక్.. ఇటీవలే లంక చేతిలో పరాభవం చెందింది. ఇప్పుడు ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది.

ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య శుక్రవారం మూడో టీ20 జరిగింది. ఈ మ్యాచ్​లో సునాయాస విజయం సాధించారు కంగారూలు. సిరీస్​ను 2-0 తేడాతో కైవసం చేసుకున్నారు.

పెర్త్​ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​ చేసిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఇఫ్తికర్​ అహ్మద్​(45), ఇమాముల్​ హక్​ (14) తప్ప మరెవరూ రెండంకెల స్కోరు చేయలేదు.

ఛేదనలో వార్నర్​(48*), ఫించ్​(52*) ధాటికి వికెట్​ కోల్పోకుండా 11.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది ఆసీస్​.

ఆసీస్ బౌలర్​ సీన్​ అబాట్ 'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్'​గా నిలిచాడు. 'మ్యాన్​ ఆఫ్​ ద సిరీస్' స్టీవ్​​ స్మిత్​కు దక్కింది.

త్వరలో ఈ రెండు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్​ జరగనుంది. బ్రిస్బేన్​ వేదికగా మొదటి మ్యాచ్​, ఆడిలైడ్​లో రెండో టెస్టు జరగనుంది.

వరుస పరాజయాలు...

టీ20ల్లోపాకిస్థాన్​ సారథిగా సర్ఫరాజ్​ అహ్మద్​ను తొలగించి బాబర్​ అజామ్​కు బాధ్యతలు అప్పగించింది పాక్​ క్రికెట్​ బోర్డు(పీసీబీ). కెప్టెన్​ను మార్చినా పాకిస్థాన్​ రాత మారలేదు. ఇటీవలే లంక చేతిలో, ఇప్పుడు ఆసీస్​ చేతిలో ఓడింది.

గత 15 సిరీస్​ల్లో పదకొండు గెలిచిన పాక్​.. ఇటీవలే జరిగిన సిరీస్​ల్లో( దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్​, శ్రీలంక, ఆసీస్) నాలుగింట్లో ఓటమిపాలైంది.

పాకిస్థాన్.. 2017లో 10 మ్యాచ్​లు ఆడి 8 గెలవగా...2018లో 19 మ్యాచ్​ల్లో 17 విజయాలు నమోదు చేసింది. ఈ ఏడాది ఆ గణాంకాలు మారాయి. ఇప్పటివరకు 10 మ్యాచ్​ల్లో ఒక్కటి మాత్రమే గెలిచింది, మరొకటి వర్షం కారణంగా డ్రా అయింది. 8 మ్యాచ్​ల్లో ఓడిపోయింది.

ABOUT THE AUTHOR

...view details