తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసీస్​దే రెండో టీ20... సిరీస్‌ కైవసం

బ్రిస్బేన్‌ వేదికగా బుధవారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 9 వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

శ్రీలంకపై ఆసీస్​కు మరో విజయం... టీ20 సిరీస్‌ కైవసం

By

Published : Oct 30, 2019, 8:18 PM IST

బ్రిస్బేన్​లో శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఆస్ట్రేలియా. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకుంది కంగారూ జట్టు.

సీనియర్లు మెరుపులు...

తొలి టీ20లో శతకంతో చెలరేగిన వార్నర్‌ (60*) మరోసారి మెరిశాడు. వార్నర్‌కు తోడుగా స్మిత్‌ (53*) కూడా చెలరేగడం వల్ల ఆసీస్‌ 13 ఓవర్లలోనే 118 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 19 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాట్స్‌మెన్‌లో కుశాల్‌ పెరెరా(27), దనుష్క (21) మాత్రమే రెండు పదుల స్కోరును అందుకోగలిగారు. ఆసీస్ బౌలర్లలో బిల్లీ, కమిన్స్‌, ఆస్టన్, జంపా తలో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టును మలింగ ఆదిలోనే ఎదురుదెబ్బ తీశాడు. ఫించ్‌ను ఖాతా తెరవక ముందే పెవిలియన్‌కు పంపాడు. అయితే వన్‌డౌన్‌లో వచ్చిన స్మిత్‌తో కలిసి వార్నర్‌ ఇన్నింగ్స్‌ను నడిపి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తొలి మ్యాచ్‌లో ఆసీస్ 134 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆఖరి మ్యాచ్‌ మెల్‌బోర్న్‌ వేదికగా శుక్రవారం జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details