టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్‌శర్మను ఔట్ చేసేందుకు తమ జట్టు తగిన ప్రణాళికలతో సిద్ధంగా ఉందని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియోన్ తెలిపాడు. రోహిత్ లాంటి ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మన్‌ను ఎదుర్కోవడం ఆసీస్ బౌలర్లకు పెద్ద సవాలని అభిప్రాయపడ్డాడు.
"ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో రోహిత్‌శర్మ ఒకడు అని చెప్పడంలో సందేహం లేదు. అతనితో ఆడడం మా బౌలర్లకు పెద్ద సవాలే. కానీ, అలాంటి సవాళ్లను మేమూ ఆస్వాదిస్తాం. టీమ్ఇండియాలో రోహిత్ శర్మ బలమైన బ్యాట్స్‌మన్. అతడ్ని ఎవరు ఔట్ చేస్తారనే దానిపై ఆసక్తి ఉంటుంది. కానీ, రోహిత్‌ను ఔట్ చేసేందుకు మా దగ్గర తగినన్ని ప్రణాళికలు ఉన్నాయి. వీలైనంత త్వరగానే ఔట్ చేయాలని భావిస్తున్నాం. కానీ, రోహిత్‌ను గౌరవిస్తాం".