తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుడు ఇతడే!

2019లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్​మన్​గా ఆస్ట్రేలియా క్రికెటర్ మార్నస్ లబుషేన్ రికార్డు సృష్టించాడు. కోహ్లీ, స్మిత్ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లను సైతం వెనక్కినెట్టాడు లబుషేన్.

Australia vs Pakistan: Marnus Labuschagne Overtakes Steve Smith To Become Leading Test Run-Scorer In 2019
2019లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడు ఎవరో తెలుసా?

By

Published : Nov 30, 2019, 5:36 AM IST

ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన బ్యాట్స్​మన్ ఎవరో తెలుసా? ఏముంది.. విరాట్ కోహ్లీనో, స్టీవ్ స్మిత్​ అయి ఉంటాడో అనుకుంటున్నారా! వీళ్లెవరూ కాదు.. ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్.. ఈ ఘనత సాధించాడు. 2019లో 779 పరుగులు చేసి కోహ్లీ, స్మిత్​ను అధిగమించాడు.

778 పరుగులతో స్టీవ్ స్మిత్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఇటీవల రెండు డబుల్ శతకాలతో ఆకట్టుకున్న మయాంక్ అగర్వాల్ 754 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. బెన్ స్టోక్స్​, అజింక్య రహానే తర్వాతి స్థానాల్లో నిలిచారు. 612 పరుగులతో విరాట్ కోహ్లీ ఈ జాబితాలో 7వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.

మార్నస్ లబుషేన్.

ఆగస్టులో జరిగిన యాషెస్​ సిరీస్​ రెండో టెస్టులో స్టీవ్ స్మిత్ స్థానంలో కాంకషన్​గా వచ్చిన లబుషేన్ అప్పటి నుంచి అదరగొడుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న పాకిస్థాన్​తో సిరీస్​లోనూ రెండు శతకాలు(185, 126) చేశాడు. 11 టెస్టులాడిన అనుభవం ఉన్న లబుషేన్.. మొత్తం 874 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో రెండు సెంచరీలు సహా 5 అర్ధశతకాలు ఉన్నాయి.

ఇదీ చదవండి: ఇంగ్లాండ్​పై లాథమ్ శతకం.. కివీస్ స్కోరు 173/3

ABOUT THE AUTHOR

...view details