భారత్, ఆస్ట్రేలియా మధ్య రసవత్తరంగా జరుగుతున్న టెస్టు సిరీస్ రేపటితో ముగియనుంది. చివరి టెస్టులో 328 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు బరిలోకి దిగిన టీమ్ఇండియా బ్యాటింగ్కు ఆదిలోనే వరుణుడు బ్రేకులు వేశాడు. అయితే మంగళవారం కూడా మ్యాచ్ జరగడం అనుమానంగానే కనిపిస్తోంది. గబ్బాలో రేపు ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడనుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ప్రస్తుత బోర్డర్-గావస్కర్ ట్రోఫీని భారత్ నిలబెట్టుకోవాలంటే.. ఆఖరి టెస్టులో గెలిచినా లేదా డ్రా చేసినా సరిపోతుంది. కానీ ఆసీస్ దక్కించుకోవాలంటే మాత్రం కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. అయితే అందుకు చివరిరోజు పూర్తిగా ఆడాల్సింది ఉంటుంది.