తెలంగాణ

telangana

ETV Bharat / sports

73 ఏళ్ల రికార్డు బ్రేక్​ చేసిన స్మిత్​

అడిలైడ్​ వేదికగా పాకిస్థాన్​తో జరుగుతున్న డే/నైట్​ టెస్టులో ఆస్ట్రేలియా అదరగొడుతోంది. తొలి ఇన్నింగ్స్​లో ఆ దేశ స్టార్​ బ్యాట్స్​మన్​ స్టీవ్​ స్మిత్​ ఓ రికార్డు సాధించాడు. టెస్టు కెరీర్​లో 7వేల పరుగుల మైలురాయిని వేగంగా అందుకున్న ఆటగాడిగా నిలిచాడు.

australia-star-bastman-steve-smith-becomes-fastest-man-to-reach-7000-test-runs
గులాబి టెస్టు: 73 ఏళ్ల రికార్డు బ్రేక్​ చేసిన స్మిత్​

By

Published : Nov 30, 2019, 11:56 AM IST

ఆస్ట్రేలియా స్టార్​ బ్యాట్స్​మన్​ స్టీవ్​ స్మిత్​.. టెస్టుల్లో తన ఆధిపత్యం కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం టెస్టుల్లో నెం.1 స్థానంలో ఉన్న అతడు.. తాజాగా 7వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

ట్రాక్​ రికార్డు..

2010 జులై 13న పాకిస్థాన్​పై తొలి టెస్టులో అరంగేట్రం చేశాడు స్మిత్​. సుదీర్ఘ ఫార్మాట్​లో తిరుగులేని ఆటగాడిగా దూసుకెళ్తున్నాడు. తాజాగా 7వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనతను అతి తక్కువ ఇన్నింగ్స్​ల్లో (126) సాధించి రికార్డు సృష్టించాడు. ఫలితంగా ఇప్పటివరకు వాలీ హమండ్ (131) పేరిట ఉన్న రికార్డు 73 ఏళ్ల తర్వాత బ్రేక్ అయింది.

వేగంగా 7వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో భారత్​కు చెందిన వీరేంద్ర సెహ్వాగ్​(134 ఇన్నింగ్స్​) స్థానంలో ఉన్నాడు.

బ్రాడ్​మన్​ను వెనక్కి నెట్టి​..

ఆసీస్​ దిగ్గజ ఆటగాడు డాన్​ బ్రాడ్​మన్​ కెరీర్​లో 6వేల 996 టెస్టు పరుగులు చేశాడు. తాజాగా స్మిత్​ అతడిని అధిగమించి.. 7వేల పరుగుల మైలురాయిని అందుకున్న 11వ ఆస్ట్రేలియా క్రికెటర్​గా పేరు తెచ్చుకున్నాడు. అయితే టెస్టు కెరీర్​లో ఈ పరుగులు చేయడానికి బ్రాడ్​మన్​ 52 మ్యాచ్​లు మాత్రమే తీసుకోగా.. స్మిత్​ మాత్రం 70 టెస్టుల్లో పూర్తి చేశాడు.

ABOUT THE AUTHOR

...view details