తెలంగాణ

telangana

ETV Bharat / sports

మెరుపు కోసం ఇకపై అలా చేయడం కుదరదు - బంతికి లాలాజలం పూయడం నిషేధం

బౌలర్లు బంతిని ఉపయోగించే విషయమై పలు కొత్త సూచనలు చేసింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ఇకపై సలైవా, చెమటను రుద్దకూడదనే నిబంధనలు జారీ చేసింది. కరోనా ప్రభావం ముగిసిన తర్వాత ఇవి అమల్లోకి రానున్నాయి.

Australia restricts use of saliva, sweat to shine ball under COVID-19 guidelines
ఇకపై బంతికి లాలాజలం పూయడం నిషేధం

By

Published : May 2, 2020, 6:30 AM IST

కరోనా ప్రభావం వల్ల ఆటలో పలు మార్పులు చేసేందుకు సిద్ధమైంది క్రికెట్ ఆస్ట్రేలియా. బంతిపై మెరుపు కోసం లాలాజలం, చెమట వంటివి రుద్దడాన్ని నిషేధించింది. కరోనా సంక్షోభం ముగిసిన వెంటనే వీటిని అమలు పరచనున్నట్లు తెలిపింది. ఇందుకోసం వైద్య నిపుణులు, క్రీడాధికారులు, ఫెడరల్​, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.

కరోనా అనంతరం ఆట తిరిగి ప్రారంభమయ్యాక లెవల్ ఏ,బీ,సీలుగా విభజించి... ఈ మార్గదర్శకాలు పాటించనున్నట్లు తెలిపింది. మైదానంలోకి పునరాగమనం చేయాలనుకునేవారు కచ్చితంగా క్వారంటైన్​లో ఉండి రావాలని పేర్కొంది.

అదే విధంగా శిక్షణ శిబిరాల్లోనూ పలు జాగ్రత్తలు పాటించాలని ఆటగాళ్లకు సూచించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఎలాంటి శ్వాసకోశ ఇబ్బందులున్నా వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించింది.

ABOUT THE AUTHOR

...view details