తెలంగాణ

telangana

ETV Bharat / sports

వార్నర్ విధ్వంసం.. ఆసీస్​కు ఆధిక్యం - australia - pakistan 2019

గబ్బా వేదికగా పాక్​తో జరుగుతోన్న తొలి టెస్టులో ఆసీస్ 72 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. వార్నర్ శతకంతో ఆకట్టుకోగా.. బర్న్స్ 97 పరుగులు చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 312 పరుగులు చేసింది కంగారూల జట్టు.

వార్నర్ విధ్వంసం.. ఆసీస్​కు ఆధిక్యం

By

Published : Nov 22, 2019, 1:33 PM IST

పాకిస్థాన్​తో జరుగుతున్న తొలిటెస్టులో ఆస్ట్రేలియా మెరుగైన స్థితిలో నిలిచింది. గబ్బా వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్​లో రెండు రోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్​లో వికెట్ నష్టానికి 312 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ (151, 265 బంతుల్లో) శతకంతో అదరగొట్టగా.. మరో ఓపెనర్ జోయ్ బర్న్స్​ 97 పరుగులు చేసి కొద్దిలో శతకం చేజార్చుకున్నాడు.

తొలి ఇన్నింగ్స్​లో 240 పరుగులకు ఆలౌటైన పాకిస్థాన్.. బౌలింగ్​లోనూ ప్రభావం చూపలేకపోయింది. ముఖ్యంగా ఆసీస్ ఓపెనర్ల వికెట్లు తీసేందుకు తీవ్రంగా శ్రమించింది. నిలకడగా ఆడిన వార్నర్, బర్న్స్ తొలి వికెట్​కు 222 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

వార్నర్ - బర్న్స్

వార్నర్ విధ్వంసం సృష్టించి శతకం సాధించగా.. సెంచరీకు మూడు పరుగుల ముందు యాసిర్​ షా బౌలింగ్​లో బర్న్స్ ​(97) ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్​కు వచ్చిన మార్నస్ లబుషేన్ (55) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.

18 ఇన్నింగ్స్​ల​ తర్వాత వార్నర్ సెంచరీ

ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్​లో ఘోరంగా విఫలమైన వార్నర్ ఈ మ్యాచ్​లో సత్తాచాటాడు. అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. 18 ఇన్నింగ్స్​ల తర్వాత వార్నర్ సెంచరీ చేశాడు. నిలకడగా ఆడి కెరీర్​లో 22వ సారి వంద పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 265 బంతుల్లో 151 పరుగులతో బ్యాటింగ్​ కొనసాగిస్తున్నాడు.

యాషెస్‌ సిరీస్‌లో మొత్తం పది ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ ఆస్ట్రేలియన్‌ ఓపెనర్‌ 2,8,3,5,61,0,0,0,5,11 వరుస పరుగులివి. హెడింగ్లీలో మాత్రమే అర్ధశతకం (61) చేశాడు. వార్నర్ ఆ సిరీస్‌ మొత్తం 9.5 సగటుతో 95 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం.

18 ఇన్నింగ్స్​ల​ తర్వాత వార్నర్ సెంచరీ

తొలి ఇన్నింగ్స్​లో పాకిస్థాన్ 240 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఒక్క వికెటే కోల్పోయి.. 72 పరుగుల ఆధిక్యంలో నిలిచి బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ప్రస్తుతం క్రీజులో వార్నర్, లబుషేన్ ఉన్నారు.

ఇదీ చదవండి: టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. భారత్ బౌలింగ్

ABOUT THE AUTHOR

...view details