ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ కెరీర్లో తొలిసారి ట్రిపుల్ సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అడిలైడ్ వేదికగా పాక్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో ఈ ఘనత సాధించాడు. గులాబి బంతితో ఆడుతోన్న ఈ మ్యాచ్‌లో.. 389 బంతుల్లో త్రిశతకం బాదేశాడు. ఇందులో 37 ఫోర్లు ఉన్నాయి.
కెరీర్లో అత్యధికం...
2015లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో 253 పరుగుల వ్యక్తిగత అత్యధికం నమోదు చేశాడు వార్నర్. ప్రస్తుతం జరగుతోన్న మ్యాచ్‌లో ఆ రికార్డును బ్రేక్ చేసి తొలిసారి 300 మార్కు అందుకున్నాడు. తక్కువ బంతుల్లో (389) త్రిశతకం సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
- వీరేంద్ర సెహ్వాగ్(278 బంతుల్లో) దక్షిణాఫ్రికాపై- 2007-08
- మాథ్యూ హెడెన్(362 బంతుల్లో) జింబాంబ్వేపై- 2003-04
- వీరేంద్ర సెహ్వాగ్(364 బంతుల్లో) పాకిస్థాన్‌పై-2003-04
పాకిస్థాన్‌పై రెండో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు వార్నర్.