ఈ ఏడాది సెప్టెంబరులో ఇంగ్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ను ఆడనుంది ఆస్ట్రేలియా. ఇందుకోసం 26 మందితో కూడిన ప్రిలిమినరీ జాబితాను విడుదల చేసింది ఆసీస్ క్రికెట్ బోర్డు. వీరిలో డేనియల్ సామ్స్, రిలే మెరిడిత్, జోష్ ఫిలిప్పి కొత్త ఆటగాళ్లు.
గత అక్టోబరు నుంచి తాత్కాలిక విరామంలో ఉన్న ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ సహా స్టోయినిస్‌ను జట్టులోకి తీసుకుంది. సారథి పీటర్ హ్యాండ్స్కోంబ్, షాన్ మార్ష్, నాథన్ కౌల్టర్ నైల్‌ను పక్కన పెట్టింది. ప్రస్తుతం ఈ వన్డే సిరీస్ కార్యాచరణపై ఇంగ్లాండ్ బోర్డుతో చర్చలు జరుపుతోంది ఆస్ట్రేలియా బోర్డు.