తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్​ వచ్చేసిందోచ్​... - ఐసీసీ టీ20 ప్రపంచకప్​ షెడ్యూల్​

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ పూర్తి షెడ్యూల్​ విడుదలైంది. అర్హత పోటీలన్నీ ముగియడం వల్ల ఏయే జట్లు మెగా టోర్నీలో తలపడుతున్నాయో స్పష్టత వచ్చేసింది. ఆస్ట్రేలియాలో 2020 అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు పొట్టి ప్రపంచకప్​ జరగనుంది.

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్​ వచ్చేసిందోచ్​...

By

Published : Nov 4, 2019, 7:06 PM IST

Updated : Nov 4, 2019, 7:54 PM IST

ఐసీసీ టీ-20 ప్రపంచకప్​ పూర్తి షెడ్యూల్​ విడుదలైంది. గ్రూప్​-2లో ఉన్న భారత్​ తన తొలి మ్యాచ్​ను సౌతాఫ్రికాతో ఆడనుంది. అర్హత పోటీలన్నీ ముగియడం వల్ల షెడ్యూల్​ను ప్రకటించింది ఐసీసీ. కంగారూల గడ్డపై 2020 అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు ప్రపంచకప్‌ జరగనుంది. మొత్తం 16 దేశాలు ఇందులో పాల్గొననున్నాయి.

వినూత్నంగా సూపర్​-12...

పపువా న్యూగినియా, ఐర్లాండ్‌, ఒమన్‌, నెదర్లాండ్స్‌, నమీబియా, స్కాట్లాండ్‌ వంటి పసికూనలు.. టాప్​-8లో అర్హత సాధించని బంగ్లాదేశ్​, శ్రీలంకలు మెగా టోర్నీ సూపర్​-12 కోసం ఆడనున్నాయి.

ఈ చిన్నజట్లను ఏ, బీ అనే రెండు గ్రూపులుగా విడదీసింది. శ్రీలంక ఉన్న గ్రూప్‌-ఏలో పపువా న్యూగినియా, ఐర్లాండ్‌, ఒమన్‌ ఉంటాయి. బంగ్లాదేశ్‌ ఉన్న గ్రూప్‌-బీలో నెదర్లాండ్స్‌, నమీబియా, స్కాట్లాండ్‌ ఉంటాయి. ఈ రెండు గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచిన 2 జట్లు సూపర్‌-12 దశకు అర్హత సాధిస్తాయి. తర్వాత.. అసలైన పోరు ప్రారంభమవుతుంది.

సూపర్‌-12 దశలో జట్లను గ్రూప్‌-1, గ్రూప్‌-2గా విభజించారు. చిన్నజట్లు ఆడిన... గ్రూప్‌-ఏలో తొలిస్థానంలోని జట్టు, గ్రూప్‌-బిలో రెండో స్థానంలోని జట్టు సూపర్‌-12లో గ్రూప్‌-1లో చేరతాయి. ఇందులో పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌ ఉంటాయి.

గ్రూప్‌-బిలో తొలి జట్టు, గ్రూప్‌-ఏలో రెండో జట్టు సూపర్‌-12లో గ్రూప్‌-2లో చేరతాయి. ఇందులో భారత్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌ ఉన్నాయి. సూపర్‌-12 దశలో భారత్‌ ఐదు మ్యాచుల్లో తలపడనుంది. తొలి మ్యాచ్​ను సౌతాఫ్రికాతో ఆడనుంది.

  • భారత్‌ × దక్షిణాఫ్రికా: అక్టోబర్‌ 24 (శనివారం) సాయంత్రం 4:30
  • భారత్‌ × అర్హత జట్టు(ఏ-2): అక్టోబర్‌ 29 (గురువారం) మధ్యాహ్నం 1:30
  • భారత్‌ × ఇంగ్లాండ్‌: నవంబర్‌ 1 (ఆదివారం) మధ్యాహ్నం 1:30
  • భారత్‌ × అర్హత జట్టు(బీ-1): నవంబర్‌ 5 (గురువారం) మధ్యాహ్నం 2:00
  • భారత్‌ × అఫ్గానిస్థాన్‌: నవంబర్‌ 8 (ఆదివారం) మధ్యాహ్నం 1:30

టోర్నీలో తొలి మ్యాచ్‌ శ్రీలంక, ఐర్లాండ్‌ మధ్య అక్టోబర్‌ 18న జరుగుతుంది. ఫైనల్‌ మ్యాచ్‌ మెల్‌బోర్న్‌లో నవంబర్‌ 15న జరుగుతుంది.

పూర్తి షెడ్యూల్​ ఇదే...

  • తొలి రౌండ్​:

గ్రూప్​-ఏ:శ్రీలంక, పపువా న్యూగినియా, ఐర్లాండ్‌, ఒమన్‌ జట్లు ఒకదానితో మరొకటి తలపడతాయి.

గ్రూప్​-బీ: బంగ్లాదేశ్, నెదర్లాండ్స్‌, నమీబియా, స్కాట్లాండ్‌ జట్లు టాప్​-12 కోసం పోటీపడతాయి.

అక్టోబర్​ 18: శ్రీలంక X క్వాలిఫయర్​ ఏ3(కార్డీనియా పార్క్​, దక్షిణ గీలాంగ్​)
అక్టోబర్​ 18:క్వాలిఫయర్​ ఏ2 X క్వాలిఫయర్​ ఏ4(కార్డీనియా పార్క్​, దక్షిణ గీలాంగ్)
అక్టోబర్​ 19: బంగ్లాదేశ్​ X క్వాలిఫయర్​ బీ3 (బెల్లేరివె ఓవల్​, టాస్మానియా)
అక్టోబర్​ 19: క్వాలిఫయర్​ బీ2 X క్వాలిఫయర్​ బీ4 (బెల్లేరివె ఓవల్​, టాస్మానియా)
అక్టోబర్​ 20: క్వాలిఫయర్​ ఏ3 X క్వాలిఫయర్​ ఏ4(కార్డీనియా పార్క్​, దక్షిణ గీలాంగ్)
అక్టోబర్​ 20: శ్రీలంక X క్వాలిఫయర్​ ఏ2(కార్డీనియా పార్క్​, దక్షిణ గీలాంగ్)
అక్టోబర్​ 21: క్వాలిఫయర్​ బీ3 X క్వాలిఫయర్​ బీ4 (బెల్లేరివె ఓవల్​, టాస్మానియా)
అక్టోబర్​ 21: బంగ్లాదేశ్​ X క్వాలిఫయర్​ బీ2 (బెల్లేరివె ఓవల్​, టాస్మానియా)
అక్టోబర్​ 22:క్వాలిఫయర్​ ఏ2 X క్వాలిఫయర్​ ఏ3 (కార్డీనియా పార్క్​, దక్షిణ గీలాంగ్​)
అక్టోబర్​ 22: శ్రీలంక X క్వాలిఫయర్​ ఏ4(కార్డీనియా పార్క్​, దక్షిణ గీలాంగ్​)
అక్టోబర్​ 23: క్వాలిఫయర్​ బీ2 X క్వాలిఫయర్​ బీ3 (బెల్లేరివె ఓవల్​, టాస్మానియా)
అక్టోబర్​ 23: బంగ్లాదేశ్ ​X క్వాలిఫయర్​ బీ4 (బెల్లేరివె ఓవల్​, టాస్మానియా)

  • సూపర్​-12 మ్యాచ్​లివే....

ఇప్పటికే 8 అగ్రజట్లు ఇందులో చోటు దక్కించుకున్నాయి. తొలి రౌండ్​ పోటీలు ముగిశాక మిగతా 4 జట్లు ఇందులో కలుస్తాయి.

గ్రూప్​-1లోపాకిస్థాన్​, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్​, వెస్టిండీస్​ జట్లు ఉన్నాయి. వీటికి ఏ1, బీ2(తొలిరౌండ్​ జాబితాలో క్రమం ప్రకారం) కలుస్తాయి.

గ్రూప్​-2లో భారత్​, ఇంగ్లాండ్​, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్​ జట్లు ఉన్నాయి. వీటికి బీ1, ఏ2 (తొలరౌండ్​ జాబితాలో క్రమం ప్రకారం) కలుస్తాయి.

అక్టోబర్​ 24: ఆస్ట్రేలియా X పాకిస్థాన్​ ( సిడ్నీ క్రికెట్​ గ్రౌండ్​, సిడ్నీ)
అక్టోబర్​ 24: భారత్​ X దక్షిణాఫ్రికా (పెర్త్​ స్టేడియం, పెర్త్​)
అక్టోబర్​ 25: ఏ1 X బీ2 (బ్లండ్​ స్టోన్​ ఎరీనా, హోబర్ట్​)
అక్టోబర్​ 25: న్యూజిలాండ్​ X వెస్టిండీస్​ (మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​, మెల్​బోర్న్​)
అక్టోబర్​ 26: అఫ్గానిస్థాన్​ X ఏ2 (పెర్త్​ స్టేడియం, పెర్త్​)
అక్టోబర్​ 26: ఇంగ్లాండ్​ ​ X బీ2 (పెర్త్​ స్టేడియం, పెర్త్​)
అక్టోబర్​ 27: న్యూజిలాండ్​ X బీ2 (బ్లండ్​ స్టోన్​ ఎరీనా, హోబర్ట్​)
అక్టోబర్​ 28: అఫ్గానిస్థాన్​ X బీ1 (పెర్త్​ స్టేడియం, పెర్త్​)
అక్టోబర్​ 28: ఆస్ట్రేలియా X వెస్టిండీస్​ (పెర్త్​ స్టేడియం, పెర్త్​)
అక్టోబర్​ 29: పాకిస్థాన్​​ X ఏ1 (సిడ్నీ క్రికెట్​ గ్రౌండ్​, సిడ్నీ)
అక్టోబర్​ 29: భారత్​​​ X ఏ2 (మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​, మెల్​బోర్న్​)
అక్టోబర్​ 30: ఇంగ్లాండ్​​​​ X దక్షిణాఫ్రికా ( సిడ్నీ క్రికెట్​ గ్రౌండ్​, సిడ్నీ)
అక్టోబర్​ 30: వెస్టిండీస్​​​​ X బీ2 (పెర్త్​ స్టేడియం​, పెర్త్​)
అక్టోబర్​ 31: పాకిస్థాన్​​​​ X న్యూజిలాండ్​ (బ్రిస్బేన్​ క్రికెట్​ గ్రౌండ్​, బ్రిస్బేన్​)
అక్టోబర్​ 31: ఆస్ట్రేలియా​​​​ X ఏ1 (బ్రిస్బేన్​ క్రికెట్​ గ్రౌండ్​, బ్రిస్బేన్​)
నవంబర్ 1: దక్షిణాఫ్రికా ​​​X అఫ్గానిస్థాన్​ (అడిలైడ్​ ఓవల్​, అడిలైడ్​)
నవంబర్ 1: భారత్​ ​​​X ఇంగ్లాండ్​ (మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​, మెల్​బోర్న్​)
నవంబర్ 2: ఏ2 ​​X బీ1( సిడ్నీ క్రికెట్​ గ్రౌండ్​, సిడ్నీ)
నవంబర్ 2: న్యూజిలాండ్​ X ఏ1 (బ్రిస్బేన్​ క్రికెట్​ గ్రౌండ్​, బ్రిస్బేన్​)
నవంబర్ 3: పాకిస్థాన్​ X వెస్టిండీస్​(అడిలైడ్​ ఓవల్​, అడిలైడ్​)
నవంబర్ 3: ఆస్ట్రేలియా X బీ2​(అడిలైడ్​ ఓవల్​, అడిలైడ్​)
నవంబర్ 4: ఇంగ్లాండ్​ X అఫ్గానిస్థాన్​ (బ్రిస్బేన్​ క్రికెట్​ గ్రౌండ్​, బ్రిస్బేన్​)
నవంబర్ 5:దక్షిణాఫ్రికా ​​​X ఏ2​ (అడిలైడ్​ ఓవల్​, అడిలైడ్​)
నవంబర్ 5:భారత్​​ X బీ2 ​(అడిలైడ్​ ఓవల్​, అడిలైడ్​)
నవంబర్ 6: పాకిస్థాన్​ X బీ2 (మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​, మెల్​బోర్న్​)
నవంబర్ 6: ఆస్ట్రేలియా​ X న్యూజిలాండ్​ (మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​, మెల్​బోర్న్​)
నవంబర్ 7: ఇంగ్లాండ్​ X ఏ2 (అడిలైడ్​ ఓవల్​, అడిలైడ్​)
నవంబర్ 7: విండీస్​ X ఏ1(మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​, మెల్​బోర్న్​)
నవంబర్ 8: దక్షిణాఫ్రికా X బీ1 (సీడ్నీ క్రికెట్​ గ్రౌండ్​, సిడ్నీ)
నవంబర్ 8: భారత్​ X అఫ్గానిస్థాన్​ (సీడ్నీ క్రికెట్​ గ్రౌండ్​, సిడ్నీ)

  • సెమీఫైనల్స్​-ఫైనల్​ మ్యాచ్​లు:

నవంబర్​ 11: సిడ్నీ క్రికెట్​ గ్రౌండ్​, సిడ్నీ

నవంబర్​ 12: అడిలైడ్​ ఓవల్​, అడిలైడ్​

నవంబర్​ 15: మెల్​బోర్న్​ క్రికెట్​ గ్రౌండ్​, మెల్​బోర్న్​

Last Updated : Nov 4, 2019, 7:54 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details