ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో భారత బౌలర్లు అదరగొట్టారు. దీంతో ఆతిథ్య ఆసీస్ 195 పరుగులకే ఆలౌట్ అయింది. లబుషేన్ అత్యధికంగా 48 పరుగులు చేశాడు. మెల్బోర్న్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది.
భారత బౌలర్లు భళా.. ఆస్ట్రేలియా 195 ఆలౌట్ - బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020
బాక్సింగ్ డే టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆతిధ్య ఆసీస్ 195 పరుగులకే ఆలౌట్ అయింది. బుమ్రా 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌తోనే సిరాజ్, గిల్.. భారత్ తరఫున టెస్టు అరంగేట్రం చేశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆచితూచి ఆడింది. దీంతో తక్కువ పరుగుల వ్యవధిలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. లబుషేన్ 48, హెడ్ 38, వేడ్ 30, గ్రీన్ 12, పైన్ 13 మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో బుమ్రా 4, అశ్విన్ 3, సిరాజ్ 2, జడేజా ఓ వికెట్ తీశాడు.
గత కొన్నిరోజుల క్రితం మరణించిన ఆసీస్ దిగ్గజ క్రికెటర్ డీన్ జోన్స్‌కు టీ విరామం సమయంలో నివాళి అర్పించారు. ఆయన టోపీ, బ్యాట్, కళ్లజోడును తీసుకొచ్చి, వికెట్ల దగ్గర పెట్టారు. ఈ ఫొటోను ఐసీసీ తన సోషల్ మీడియాలో పంచుకుంది.