టీమ్ఇండియాతో జరిగిన రెండో టెస్టులో స్లో ఓవర్ రేటు కారణంగా ఆస్ట్రేలియా జట్టుకు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోత విధించింది ఐసీసీ. దీనితో పాటే టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్లను నాలుగు తగ్గించింది. మెల్బోర్న్లో నాలుగు రోజు ఆటలో ఆసీస్.. నిర్ణీత సమయం కంటే రెండు ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసింది. దీంతో ఐసీసీ ఎలైట్ ప్యానల్ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్.. కంగారూ జట్టు ఫీజులో కోత విధించారు.
ఐసీసీ నిబంధనల్లో ఆర్టికల్ 2.22 ప్రకారం.. మ్యాచ్‌లో కనీస ఓవర్ రేటు కంటే తక్కువగా నమోదైతే ఓవర్‌కు 20 శాతం చొప్పున మ్యాచ్ ఫీజులో కోత విధించాల్సి ఉంటుంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన ఆర్టికల్ 16.11.2 ప్రకారం.. కనీస ఓవర్ రేటు తక్కువైన సమయంలో ప్రతి ఓవర్‌కు ఆ జట్టు సాధించిన పాయింట్లలో రెండింటిని కోత విధిస్తారు. టీమ్ఇండియాతో రెండో టెస్టులో ఆస్ట్రేలియా రెండు ఓవర్ల తక్కువ రేటుతో బౌలింగ్ చేసిన ఫలితంగా ఆసీస్ జట్టు మ్యాచ్ ఫీజులో 40 శాతం కోతతో పాటు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్లలో నాలుగింటిని తగ్గించారు.
కెప్టెన్ అంగీకారం