ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో 'మార్ష్ షెఫీల్డ్ షీల్డ్' టోర్నీ చాలా ప్రత్యేకం. ఎంతో మంది క్రికెటర్లు ఈ టోర్నీ ద్వారా తెరపైకి వచ్చి.. ప్రపంచ క్రికెట్‌ను శాసించారు. అలాంటి టోర్నీ టైటిల్ గెలవడానికి ఆసీస్‌లోని పలు దేశవాళీ జట్లు తీవ్రంగా పోటీపడతాయి. అయితే కరోనా నేపథ్యంలో ఈ టోర్నీ తుది రౌండ్ పోటీలు రద్దు చేశారు. అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత విజేత తేలకుండా ఈ టోర్నీ రద్దవడం అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ఇలా..! - Australia's Sheffield Shield news 2020
కరోనా వైరస్ దెబ్బకు క్రీడారంగం కుదేలైపోతోంది. ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్ టోర్నీ 'షెఫీల్డ్ షీల్డ్' తుది రౌండ్ పోటీలు రద్దయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధం (1939-1945) తర్వాత ఇలా జరగడం తొలిసారి.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి విజేతలేకుండా..!
ఈ టోర్నీలో ఇప్పటికే తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన న్యూసౌత్ వేల్స్ బ్లూస్ జట్టు 6 విజయాలతో 12.23 పాయంట్లతో పట్టికలో టాపర్‌గా నిలిచింది. ఈ జట్టును విజేతగా ప్రకటిస్తారా ? లేదంటే టోర్నీ మరెప్పుడైనా నిర్వహిస్తారా అనేది సందిగ్ధంలో పడింది. రెండో స్థానంలో విక్టోరియా జట్టు ఉంది. కరోనా దెబ్బకు కొన్ని మ్యాచ్‌లను ఖాళీ స్టేడియంలోనూ నిర్వహించారు. అయితే తాజాగా ఆ దేశ వైద్యవిభాగం సూచనలతో టోర్నీ పూర్తిగా రద్దయింది.