కరోనాతో నిలిచిపోయిన క్రికెట్.. ఇప్పుడిప్పుడే మళ్లీ మొదలవుతోంది. అయితే ఖాళీ స్టేడియాల్లో మాత్రమే ఆట నడిపించడానికే అన్ని బోర్డులు ప్రయత్నిస్తున్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం అందరికి భిన్నంగా అభిమానులను స్టేడియానికి రప్పించి మరీ తొలి పోటీ క్రికెట్ టోర్నీని ప్రారంభించబోతోంది. ఈ నెల 6-8 తేదీల్లో డార్విన్ వేదికగా టీ20 కార్నివాల్ పేరిట ఓ టోర్నీ జరగబోతోంది. ఈ పోటీలను చూసేందుకు 500 మంది వరకు అభిమానులను అనుమతించబోతున్నారు. ఈ టోర్నీలో ఎంపిక చేసిన కొన్ని మ్యాచ్‌లను మైక్రికెట్ ఫేస్‌బుక్ పేజీలో ప్రత్యక్ష ప్రసారం కూడా చేయనున్నారు. ఈ టోర్నీ తర్వాత డార్విన్ అండ్ డిస్ట్రిక్ట్ వన్డే సీజన్ కూడా ప్రారంభం కాబోతోంది.
ఆస్ట్రేలియాలో అభిమానుల మధ్యే టీ20 లీగ్.. జూన్ 6 నుంచే! - ఆస్ట్రేలియా క్రికెట్
ఆస్ట్రేలియాలో క్రీడల పునః ప్రారంభానికి రంగం సిద్ధమైంది. రెండు నెలలుగా స్తంభించిన క్రికెట్‌కు ఓ టీ20 లీగ్‌తో స్వాగతం పలుకుతోంది ఆ దేశ క్రికెట్ బోర్డు. ఈ నేపథ్యంలో జున్ 6 నుంచి 8 వరకు డార్విన్ టీ20 లీగ్‌ను నిర్వహించనుంది.
ఆస్ట్రేలియాలో అభిమానుల మధ్యే టీ20 లీగ్.. జూన్ 6 నుంచే!