తెలంగాణ

telangana

ETV Bharat / sports

సిరీస్​ డిసైడర్​లో ఆసీస్​ జోరు - delhi match

దిల్లీ వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మక పోరులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్​ను ధాటిగా ఆరంభించింది. వికెట్లు కోల్పోకుండా వేగంగా పరుగులు రాబడుతోంది. భారత జట్టులో లోకే​శ్​​ రాహుల్​కు విశ్రాంతినిచ్చారు.

సిరీస్​ డిసైడర్​లో ఆసీస్​ జోరు

By

Published : Mar 13, 2019, 2:09 PM IST

టైటిల్​ పోరుకు భారత్​- ఆస్ట్రేలియా సిద్ధమయ్యాయి. దిల్లీ వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది కంగారూల జట్టు. 2-2 తో సమంగా ఉన్న సిరీస్​ను కైవసం చేసుకోవాలని ఇరుజట్లు ప్రయత్నిస్తున్నాయి.

బలమైన బ్యాటింగ్​

ఆస్ట్రేలియా బ్యాట్స్​మెన్​లో ఖవాజా అద్భుతమైన ఫామ్​లో ఉన్నాడు. ఫించ్, హాండ్స్​కాంబ్, గత మ్యాచ్ సంచలనం టర్నర్​లతో ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ దుర్భేద్యంగా ఉంది.

నిర్ణయాలు కీలకం...

నాలుగో వన్డేలో ధోని లేని లోటు స్పష్టంగా కనిపించింది. క్లిష్టమైన పరిస్థితుల్లో సరైన నిర్ణయం తీసుకుంటూ జట్టును ముందుకు తీసుకెళ్లగల సమర్ధుడు మహీ. మరి ఈ మ్యాచ్​లో కోహ్లీ ఎంతమేర తన అనుభవంతో నడిపిస్తాడో చూడాల్సిందే. తీసుకొనే ప్రతి నిర్ణయం కీలకం కానుంది.

స్పిన్​కు అనుకూలం...

దిల్లీ పిచ్ మణికట్టు స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. కుల్దీప్, చాహల్ మంచి ప్రదర్శన ఇస్తే తక్కువ పరుగులకే ఆసిస్​ను కట్టడి చేయొచ్చు. బుమ్రా, భువనేశ్వర్, షమి రూపంలో పేస్​ విభాగం పటిష్ఠంగా కనిపిస్తోంది.

ప్రపంచకప్ ముందు భారత్​కు ఇదే చివరి వన్డే. మెగాటోర్నీకి వెళ్లే జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న పంత్, విజయ్ శంకర్ ఈ మ్యాచ్​లో నిరూపించుకోవాలి. ఆఖరి వన్డేలో జడేజాకు నిరాశ ఎదురైంది. దిల్లీ పిచ్ లెఫ్టార్మ్ స్పిన్నర్లకు అనుకూలించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details