తెలంగాణ

telangana

ETV Bharat / sports

వార్నర్​ హెల్మెట్​, గ్లోవ్స్​ ఏమయ్యాయి...? - cricket news telugu

పాకిస్థాన్​తో జరుగుతున్న రెండో టెస్టులో ట్రిపుల్​ సెంచరీతో చెలరేగాడు ఆస్ట్రేలియా ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​. చారిత్రక ఇన్నింగ్స్​కు గుర్తుగా హెల్మెట్​, గ్లోవ్స్​ను ఓ చిన్నారికి కానుకగా ఇచ్చాడీ స్టార్​ బ్యాట్స్​మన్​. అయితే ఆ పిల్లాడి ఆనందాన్ని కొంచెంసేపు కూడా ఉండనివ్వలేదు కొంతమంది కుర్రాళ్లు.

australia batsmen david warner gifts helmet to kid after triple century but elder boys snatch it away
చిన్నారికి వార్నర్​ గిఫ్ట్... లాక్కున్న పెద్దోళ్లు

By

Published : Dec 1, 2019, 9:43 AM IST

పాకిస్థాన్‌తో జరుగుతున్న డే/నైట్‌ టెస్టులో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ త్రిశతకం బాదేశాడు. అడిలైడ్‌ ఓవల్‌లో పరుగుల వరద పారించి ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు బ్రాడ్‌మన్‌ (299*) రికార్డును తిరగరాశాడు. వేగంగా ఆడుతూ 335* పరుగులతో అజేయంగా నిలిచాడు. సమయం లేకపోవడం వల్ల సారథి టిమ్‌పైన్‌ తొలి ఇన్నింగ్స్‌ను 589/3 వద్ద డిక్లేర్‌ చేశాడు.

ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లే క్రమంలో ఓ చిన్నారి అభిమానికి వార్నర్‌ తన హెల్మెట్‌, గ్లోవ్స్​ను కానుకగా అందించాడు. గతంలోనూ తనకోసం ఎదురుచూసే అభిమానులు, చిన్నారులకు ఈ విధంగా సర్​ప్రైజ్​లు ఇచ్చాడీ ఓపెనర్.

గతంలో వార్నర్​ నుంచి గిఫ్ట్​లు అందుకున్న పిల్లలు

పాపం లాక్కున్నారు...

అడిలైడ్‌లో హెల్మెట్‌ను అందుకున్న చిన్నారికి ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. వెంటనే దానికోసం కొంతమంది కుర్రాళ్లు గుంపుగా మీదపడ్డారు. హెల్మెట్‌ కోసం కొట్లాడి.. ఆ పిల్లాడి చేతిలో నుంచి వాటిని లాక్కున్నారు. ఇదంతా టీవీ తెరల్లో స్పష్టంగా కనిపించింది. దొంగిలించిన పెద్ద వయసు కుర్రాళ్లపై ట్విట్టర్​ వేదికగా ఫైర్‌ అయ్యారు నెటిజన్లు. ఆ చిన్నారికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details