తెలంగాణ

telangana

ETV Bharat / sports

వేటు నుంచి విముక్తి.. యాషెస్​తో బాన్​క్రాఫ్ట్​ రీఎంట్రీ - ball tamparing bancraft

ప్రతిష్ఠాత్మక యాషెస్​ సిరీస్​లో ఇంగ్లాండ్​తో తలపడేందుకు ఆస్ట్రేలియా జట్టు సిద్ధమౌతోంది. 17 మంది సభ్యులను క్రికెట్​ ఆస్ట్రేలియా ప్రకటించింది. గతేడాది బాల్​ ట్యాంపరింగ్​ ఘటనలో వేటు ఎదుర్కొన్న స్మిత్​, వార్నర్​, బాన్​క్రాఫ్ట్​కు చోటు దక్కింది. ఆగస్ట్​ 1 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుంది.

యాషెస్​ సిరీస్​లో ముగ్గురు నిషేధిత ఆటగాళ్లు

By

Published : Jul 27, 2019, 9:22 AM IST

Updated : Jul 27, 2019, 10:53 AM IST

ఆస్ట్రేలియా ఓపెనర్​ కామెరాన్​ బాన్​క్రాఫ్ట్​ మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గతేడాది దక్షిణాఫ్రికాలో బాల్​ ట్యాంపరింగ్​కు పాల్పడినందుకు స్మిత్​, వార్నర్​, బాన్​క్రాఫ్ట్​పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్​లో చోటు దక్కించుకొని స్మిత్​, వార్నర్​ మళ్లీ బ్యాట్​ పట్టుకోగా... ప్రస్తుతం యాషెస్​ సిరీస్​లో బాన్​ కూడా బరిలోకి దిగనున్నాడు.

వార్నర్​, స్మిత్​

కెప్టెన్​, వికెట్​కీపర్​ టిమ్​ పైన్​ నేతృత్వంలోని 17 మంది సభ్యుల జట్టును శుక్రవారం ప్రకటించింది ఆస్ట్రేలియా బోర్డు. యాషెస్​ సిరీస్​ ఆగస్ట్​ 1న ఆరంభమవుతోంది. జులై 27న ఇంగ్లాండ్​లోని ఎడ్జ్​బాస్టన్​కు చేరుకోనుంది ఆసీస్​ జట్టు.

బాన్​క్రాఫ్ట్

2001 నుంచి ఇప్పటివరకు ఇంగ్లీష్​ దేశంలో ఆస్ట్రేలియా ఈ టోర్నీ కప్పు గెలవలేదు. 2017-18 సొంతగడ్డపై జరిగిన సిరీస్​ను మాత్రం కంగారూ జట్టే సొంతం చేసుకుంది.

ఆస్ట్రేలియా జట్టు...

టిమ్​ ఫైన్​(సారథి), బాన్​క్రాఫ్ట్​, కమిన్స్​, హారిస్​, హేజిల్​వుడ్​, ట్రావిస్​ హెడ్​, ఖవాజా, లబుషేన్​, లైయన్​, మిచెల్​ మార్ష్​, మైకెల్​ నెసర్​, ప్యాటిన్సన్​, సిడిల్​, స్టీవ్​ స్మిత్​, స్టార్క్​, మాథ్యూ వేడ్​, డేవిడ్​ వార్నర్​.

Last Updated : Jul 27, 2019, 10:53 AM IST

ABOUT THE AUTHOR

...view details