తెలుగుపాటలకు వరుసపెట్టి టిక్‌టాక్‌లు చేస్తున్న ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్.. ఇప్పుడు 'మైండ్‌బ్లాక్' పాటకు తన భార్యతో కలిసి డ్యాన్స్ చేసి అదరగొట్టేశాడు. ఆ వీడియోను ట్వీట్ చేశాడు. అయితే ఇందుకోసం 50 సార్లు ప్రాక్టీసు చేశానని రాసుకొచ్చాడు.
మహేశ్పాటతో 'మైండ్‌బ్లాక్' చేసిన వార్నర్
హీరో మహేశ్‌బాబు 'మైండ్‌బ్లాక్' పాటతో ఆసీస్ క్రికెటర్ వార్నర్ అదరగొట్టేశాడు. ఆ వీడియోను ట్విట్టర్లో పంచుకున్నాడు.
వార్నర్ క్యాండీ వార్నర్
అంతకు ముందు 'బుట్టబొమ్మ', 'రాములో రాములా', 'పక్కా లోకల్' వంటి గీతాలను డ్యాన్స్‌లు చేసి ఆకట్టుకున్నాడు వార్నర్. వీటితో పాటే పలు హిందీ పాటలకు కాలు కదిపి అలరించాడు. ఈ వీడియోలన్నీ వైరల్‌గా మారుతున్నాయి.