తెలంగాణ

telangana

ETV Bharat / sports

మళ్లీ ఆదుకున్న స్మిత్... ఆసీస్ స్కోరు 170/3 - england

మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్​తో జరుగుతున్న యాషెస్ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. లబుషేన్(67), స్మిత్(60) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. బ్రాడ్​ 2 వికెట్లు తీశాడు.

యాషేస్

By

Published : Sep 5, 2019, 7:49 AM IST

Updated : Sep 29, 2019, 12:11 PM IST

యాషెస్​ సిరీస్​లో ఇంగ్లాండ్​కు తలనొప్పిగా మారాడు ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్. తొలి రెండు టెస్టుల్లో కంగారూ జట్టును నిలబెట్టిన స్మిత్(60) నాలుగో టెస్టులోనూ అదే జోరు కొనసాగించాడు. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో అర్ధసెంచరీ సాధించి క్రీజులో పాతుకుపోయాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ స్కోరు 170/3. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ 2 వికెట్లతో మరోసారి మెరవగా.. క్రేగ్ ఒవర్టన్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఆదుకున్న స్మిత్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. బ్రాడ్ ధాటికి ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. వార్నర్(0) మరోసారి విఫలమయ్యాడు. 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న కంగారూ జట్టును స్మిత్ - లబుషేన్ జోడీ ఆదుకుంది. వీరిద్దరూ 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

నిలిచిన స్మిత్..

మొదటి టెస్టులో రెండు శతకాలు.. రెండో టెస్టులో 92 పరుగులు చేసి ఇంగ్లాండ్​కు కొరకరాని కొయ్యగా మారిన స్మిత్ నాలుగో టెస్టులోనూ అర్ధశతకం చేసి ఆసీస్ ఇన్నింగ్స్​ను నిలబెట్టాడు. 93 బంతుల్లో 60 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు.

వర్షం వల్ల 44 ఓవర్లే జరిగిన మ్యాచ్

వర్షం కారణంగా తొలి రోజు 44 ఓవర్ల ఆటే జరిగింది. మ్యాచ్​ చివర్లో లబుషేన్​ను ఒవర్టన్ ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో స్టీవ్ స్మిత్(60), హెడ్(18) ఆడుతున్నారు. అయిదు టెస్టుల సిరీస్ 1-1తో సమంగా ఉంది.

ఇది చదవండి: వినూత్నంగా సముద్రం మధ్యలో క్రికెట్

Last Updated : Sep 29, 2019, 12:11 PM IST

ABOUT THE AUTHOR

...view details