తెలంగాణ

telangana

ETV Bharat / sports

స్టార్క్ విజృంభణ.. విండీస్ పరాజయం - ప్రపంచకప్​ 2019

MATCH

By

Published : Jun 6, 2019, 2:43 PM IST

Updated : Jun 6, 2019, 11:15 PM IST

2019-06-06 23:03:31

విండీస్​ పరాజయం

వెస్టిండీస్​తో జరిగిన ప్రపంచకప్​లో మ్యాచ్​లో ఆస్ట్రేలియా 15 పరుగుల తేడాతో గెలిచింది. విండీస్​ బ్యాట్స్​మెన్ షాయ్​ హోప్(68)​, హోల్డర్​(51) అర్ధశతకాలతో ఆకట్టుకున్నప్పటికీ జట్టును గెలిపించలేకపోయారు. నాటింగ్​హామ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో ఆసీస్​ బౌలర్లు స్టార్క్ ఐదు వికెట్లతో విజృంభించగా... కమిన్స్​ రెండు,  ఆడమ్ జంపా ఓ వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. 

2019-06-06 22:53:22

తొమ్మిదో వికెట్ కోల్పోయిన విండీస్​

48వ ఓవర్ వేసిన స్టార్క్ షెల్డాన్ కాట్రెల్​ను ఔట్ చేశాడు. ఈ మ్యాచ్​లో 5 వికెట్లు తీశాడు స్టార్క్​. విండీస్​ 9 వికెట్లు కోల్పోయి 256 చేసింది.
 

2019-06-06 22:42:06

ఓకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన స్టార్క్​

స్టార్క్ బౌలింగ్​లో బ్రాత్​వైట్​ ఫించ్​కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 46వ చివరి బంతికి హోల్డర్​(51)ను కూడా ఔట్ చేశాడు స్టార్క్​. 46 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది విండీస్​. 
 

2019-06-06 22:32:48

44 ఓవర్లకు విండీస్ స్కోరు 243/6

వెస్టిండీస్ కెప్టెన్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. 50 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం హోల్డర్​తో పాటు బ్రాత్​ వైట్​(8) క్రీజులో ఉన్నాడు. విండీస్​ 44 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. 

2019-06-06 22:26:59

42 ఓవర్లకు విండీస్​ స్కోరు 232/6

41వ ఓవర్​ వేసిన జంపా 9 పరుగులిచ్చాడు. అనంతరం 42వ ఓవర్​ వేసిన కౌల్టర్​నైల్ 5 పరుగులు ఇచ్చాడు.  ప్రస్తుతం విండీస్ స్కోరు 232/6

2019-06-06 22:20:26

అర్ధశతకం దిశగా హోల్డర్​

రసెల్ ఔటైన తర్వాత ఆచితూచి ఆడుతోంది విండీస్​. హోల్డర్ 45 పరుగులతో అర్ధశతకం దిశగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం విండీస్​ స్కోరు 230/6

2019-06-06 22:12:01

స్టార్క్ బౌలింగ్​లో రసెల్ ఔట్​

ఉన్నంతసేపు దూకుడుగా ఆడిన రసెల్ స్టార్క్ బౌలింగ్​లో వెనుదిరిగాడు. 11 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం విండీస్​ 38.5 ఓవర్లలో ఆరు వికెట్ల కోల్పోయి 216 పరుగులు చేసింది.

2019-06-06 22:06:40

దూకుడుగా ఆడుతున్న రసెల్

హోప్​ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రసెల్ స్కోరు వేగం పెంచాడు. వచ్చి రావడంతోనే జంపా బౌలింగ్​లో ఓ సిక్స్​, ఫోర్​తో ధాటిగా ఆడాడు. ప్రస్తుతం విండీస్​ స్కోరు 210/5

2019-06-06 22:02:03

37 ఓవర్లకు విండీస్​ స్కోరు 198/5

36వ ఓవర్​ వేసిన జంపా కేవలం ఒక్క పరుగే ఇచ్చాడు. అనంతరం 37 ఓవర్​ వలేసిన స్టార్క్​ 7 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్ నాలుగో బంతిని హోల్డర్​(31) కళ్లు చెదిరే రీతిలో సిక్సర్​గా మలిచాడు. విండీస్​ స్కోరు 198/5

2019-06-06 21:52:23

కమిన్స్ బౌలింగ్​లో హోప్ ఔట్​

నిలకడగా ఆడిన విండీస్ బ్యాట్స్​మెన్ హోప్​(66) ఔటయ్యాడు. కమిన్స్​ బౌలింగ్​లో ఖవాజాకు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం విండీస్​ 35 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది.

2019-06-06 21:47:47

34 ఓవర్లకు విండీస్ స్కోరు 188/4

కమిన్స్ వేసిన 33వ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. అనంతరం మ్యాక్స్​వెల్ 34వ ఓవర్​ వేయగా తొలి రెండు బంతులను ఫోర్లుగా మలిచాడు హోల్డర్​(22). ఆ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం విండీస్​ స్కోరు 188/4

2019-06-06 21:38:20

32 ఓవర్లకు విండీస్​ స్కోరు 173/4

కమిన్స్ వేసిన 31వ ఓవర్లో ఓ ఫోర్​తో సహా 7 పరుగులు వచ్చాయి. మ్యాక్స్​వెల్​ వేసిన 32వ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. క్రీజులో హోల్డర్​(12), హోప్​(62) ఉన్నారు. విండీస్​ స్కోరు 173/4

2019-06-06 21:31:08

రివ్యూలో నాటౌట్​గా తేలిన హోల్డర్​

మ్యాక్స్​వెల్ వేసిన 29వ ఓవర్ ఐదో బంతి ఆడిన హోల్డర్​ను ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు అంపైర్​. విండీస్​ రివ్యూ కోరగా పిచ్ ఔట్​సైడ్ లెంగ్త్ అని తేలింది. ప్రస్తుతం విండీస్ 30వ ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. 

2019-06-06 21:25:31

29 ఓవర్లకు విండీస్ స్కోరు 160/4

హిట్మైర్(21) ఔటైన తర్వాత హోల్డర్ క్రీజులోకి వచ్చాడు. 28వ ఓవర్లో కేవలం రెండు పరుగులే రాగా... జంపా వేసిన 29వ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో హోల్డర్​(6), హోప్(54) ఉన్నారు. విండీస్ స్కోరు 160/4

2019-06-06 21:18:00

షాయ్ హోప్ అర్ధశతకం

విండీస్ బ్యాట్స్​మెన్ షాయ్ హోప్ అర్ధశతకం చేశాడు.  76 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. జంపా వేసిన 26వ ఓవర్లో 5 పరుగులు రాగా.. కౌల్టర్​నైల్ వేసిన  27వ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం విండీస్ స్కోరు  149/4. 27వ ఓవర్​ తొలి బంతికే మ్యాక్స్​వెల్ బౌలింగ్​లో హిట్మైర్ రనౌట్​గా వెనుదిరిగాడు. 

2019-06-06 21:08:59

25వ ఓవర్లకు విండీస్ స్కోరు 133/3

జంపా వేసిన 24వ ఓవర్లో విండీస్ బ్యాట్స్​మెన్ 10 పరుగులు పిండుకున్నారు. షాయ్ హోప్​() రెండు ఫోర్లు కొట్టాడు. కౌల్టర్​ నైల్ వేసిన 25వ ఓవర్​లో 7 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం విండీస్ స్కోరు 

2019-06-06 21:02:06

23వ ఓవర్లకు విండీస్ స్కోరు 116/3

ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా పరుగులు కట్టడి చేస్తున్నాడు. 22వ ఓవర్లో కేవలం 3 పరుగులే ఇచ్చాడు. అనంతరం 23వ ఓవర్ వేసిన స్టార్క్​ ఓ ఫోర్​తో సహా మొత్తం 5 పరుగులు ఇచ్చాడు. ప్రస్తుతం విండీస్​ స్కోరు 116/3

2019-06-06 20:54:49

21 ఓవర్లకు విండీస్​ స్కోరు 108/3

పూరన్ ఔటైన తర్వాత విండీస్ బ్యాట్స్​మెన్ ఆచితూచి ఆడుతున్నారు. జంపా వేసిన 20వ ఓవర్లో 3 పరుగులు రాగా... స్టార్క్​ వేసిన 21వ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో షాయ్ హోప్​(27), హిట్మైర్(3) ఉన్నారు. విండీస్ స్కోరు 108/3

2019-06-06 20:45:05

40 పరుగుల వద్ద నికోలస్ పూరన్ ఔట్​

జంపా వేసిన 20వ ఓవర్ మొదటి బంతికే ఫించ్​కు క్యాచ్​ ఇచ్చాడు. క్రీజులో షాయ్ హోప్​(26) ఉన్నాడు.  ప్రస్తుతం విండీస్​ స్కోరు 99/2

2019-06-06 20:39:28

17 ఓవర్లకు విండీస్ స్కోరు 88/2

ఆడమ్ జంపా వేసిన 16వ ఓవర్లో 2 పరుగులే వచ్చాయి. అనంతరం స్టాయినీస్ వేసిన 17వ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ఓవర్​ రెండో బంతినే పూరన్ సిక్సర్​గా మలిచాడు. 

2019-06-06 20:31:56

డ్రింక్స్ విరామానికి విండీస్ స్కోరు 78/2

డ్రింక్స్​ విరామానికి విండీస్​ రెండు వికెట్లు నష్టపోయి 78 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో షాయ్ హోప్(15), పూరన్(31) ఉన్నారు

2019-06-06 20:24:52

11 ఓవర్లకు విండీస్​ స్కోరు 58/2

కౌల్టర్​నైల్ వేసిన 10వ ఓవర్లో 4 పరుగులు మాత్రమే వచ్చాయి. అనంతరం ప్యాట్ కమిన్స్​ 11వ ఓవర్ వేశాడు. ఈ ఓవర్​లో విండీస్​ బ్యాట్స్​మెన్ ఒక్క పరుగు మాత్రమే చేయగా... కమిన్స్ మూడు వైడ్​లు వేయడంతో 4 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం విండీస్ స్కోరు 58/2

2019-06-06 20:14:11

9 ఓవర్లకు విండీస్ 50/2

9 ఓవర్లకు విండీస్ 50 పరుగులు చేసింది. పూరన్ (18), హోప్ (3) క్రీజులో ఉన్నారు.

2019-06-06 20:01:57

నాలుగు ఓవర్లలో విండీస్  వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది. గేల్ (19), హోప్ (1) క్రీజులో ఉన్నారు. మూడో ఓవర్లో గేల్​ను రెండు సార్లు ఔట్​గా ప్రకటించాడు అంపైర్. కానీ రెండు సార్లు సమీక్ష కోరిన గేల్ నాటౌట్​గా నిలిచాడు. అనంతరం నాలుగో ఓవర్లో మూడు ఫోర్లు బాదాడు

గేల్ రికార్డ్

ప్రపంచకప్​లో 1000 పరుగులు సాధించిన ఆటగాడిగా గేల్ రికార్డు సాధించాడు.

2019-06-06 19:51:58

తొలి వికెట్ కోల్పోయిన విండీస్​
రెండో ఓవర్లోనే విండీస్​ వికెట్​ కోల్పోయింది. కమిన్స్ బౌలింగ్​లో లూయిస్ ఔట్​. ప్రస్తుతం కరీబియన్ జట్టు రెండు ఓవర్లలో వికెట్ నష్టానికి 7 పరుగులు చేసింది. 

2019-06-06 19:44:15

విండీస్ ఇన్నింగ్స్​ ప్రారంభం

289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది వెస్టిండీస్. గేల్, లూయిస్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. మొదటి ఓవర్లో 7 పరుగులు సాధించింది కరీబియన్ జట్టు.

2019-06-06 19:31:55

కౌల్టర్ నైల్ సెంచరీ మిస్​..

దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకున్న కౌల్టర్ నైల్ కొద్దిలో శతకం మిస్​ చేసుకున్నాడు. బ్రాత్​వైట్​ వేసిన 49వ ఓవర్లో భారీ షాట్​కు యత్నించి ఔటయ్యాడు. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 284/9

2019-06-06 19:28:30

ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్​

47 ఓవర్​ మొదటి బంతికే ప్యాట్​ కమిన్స్​ ఔటయ్యాడు. బ్రాత్​వైట్ బౌలింగ్​లో షెల్డన్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆసీస్ 46.1 ఓవర్లకు 268 పరుగులు చేసింది. క్రీజులో కౌల్టర్ నైల్(80), మిషెల్ స్టార్క్​ ఉన్నారు.

2019-06-06 19:21:53

ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్

ఏడో వికెట్ కోల్పోయిన ఆసీస్. 73 పరుగులు చేసిన స్మిత్ భారీ షాట్​కు ప్రయత్నంచి ఔటయ్యాడు. బౌండరీ లైన్ వద్ద కాట్రెల్ అద్బుత క్యాచ్​తో స్మిత్ పెవిలియన్ చేరాడు.

2019-06-06 18:48:54

స్మిత్, కౌల్టర్​నీల్ జోరు

మూడో పవర్​ప్లేలో జోరు పెంచారు ఆసీస్ బ్యాట్స్​మెన్ స్మిత్, కౌల్టర్​నీల్. 44 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు సాధించింది కంగారూ జట్టు. స్మిత్ (69), కౌల్టర్​నీల్ (65) క్రీజులో ఉన్నారు. 

2019-06-06 18:46:30

కౌల్టర్​నీల్ అద్భుత అర్ధశతకం
కౌల్టర్​నీల్.. ఆసీస్ పేసర్. విండీస్​తో జరుగుతున్న మ్యాచ్​లో తన బ్యాటు పవరేంటో చూపించాడు. కరీబియన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. సహ బ్యాట్స్​మెన్​ విఫలమైన పిచ్​పైనే 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు.

2019-06-06 18:35:58

200 మార్క్​ చేరిన ఆసీస్

79 పరుగులుకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్​ ఎట్టకేలకు 200 పరుగుల మార్క్​ను దాటింది. 39 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. స్మిత్, కౌల్టర్​నీల్ 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసుకున్నారు. స్మిత్ (56) కుదురుగా ఆడుతుండగా.. కౌల్టర్​నీల్ (38) ఎదురుదాడికి దిగాడు.

2019-06-06 18:24:04

స్మిత్ అర్ధశతకం
విండీస్​తో జరుగుతున్న ప్రపంచకప్​ మ్యాచ్​లో స్మిత్ అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 79 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో బాధ్యతాయుత ఇన్నింగ్స్​తో జట్టును ఆదుకున్నాడు.

2019-06-06 18:18:55

34 ఓవర్లలో ఆసీస్ 161/6

34 ఓవర్లలో ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. స్మిత్ (47), కౌల్టర్​నీల్ (14) క్రీజులో ఉన్నారు.

2019-06-06 18:16:14

34 ఓవర్లలో ఆసీస్ 161/6

34 ఓవర్లలో ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. స్మిత్ (47), కౌల్టర్​నీల్ (14) క్రీజులో ఉన్నారు.

2019-06-06 17:54:29

34 ఓవర్లలో ఆసీస్ 161/6

34 ఓవర్లలో ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. స్మిత్ (47), కౌల్టర్​నీల్ (14) క్రీజులో ఉన్నారు.

2019-06-06 17:51:01

34 ఓవర్లలో ఆసీస్ 161/6

34 ఓవర్లలో ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. స్మిత్ (47), కౌల్టర్​నీల్ (14) క్రీజులో ఉన్నారు.

2019-06-06 17:38:30

34 ఓవర్లలో ఆసీస్ 161/6

34 ఓవర్లలో ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. స్మిత్ (47), కౌల్టర్​నీల్ (14) క్రీజులో ఉన్నారు.

2019-06-06 17:29:38

బాధ్యతగా ఆడుతున్న స్మిత్, కారే 
26 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆసీస్ 122 పరుగులు చేసింది. స్మిత్ (36), కారే (27) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. విండీస్ బౌలర్లను సమర్థవంతగా ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తున్నారు.  

2019-06-06 17:22:32

24 ఓవర్లలో ఆసీస్ 110/5

విండీస్ బౌలర్ల బంతులకు పరుగులు సాధించడానికి ఇబ్బంది పడుతున్నారు ఆసీస్ బ్యాట్స్​మెన్. 24 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. స్మిత్ (26), కారే (25) క్రీజులో ఉన్నారు.

2019-06-06 17:15:52

21 ఓవర్లకు ఆసీస్ 86/5

విండీస్​తో జరుగుతున్న మ్యాచ్​లో ఆసీస్ 21 ఓవర్లలో 86 పరుగులు చేసింది. స్మిత్ (24), కారే (3) క్రీజులో ఉన్నారు.

2019-06-06 17:09:46

ఆసీస్ 19 ఓవర్లకు 82/5

విండీస్​తో జరుగుతున్న మ్యాచ్​లో ఆసీస్ బ్యాట్స్​మెన్ తడబాటు కొనసాగుతోంది. కరీబియన్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో కంగారూ జట్టును కంగారు పెడుతున్నారు. ఆసీస్ 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసింది. స్మిత్ (23), కారే (0) క్రీజులో ఉన్నారు.  

2019-06-06 17:05:36

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్. 79 పరుగుల వద్ద 19 పరుగులు చేసి స్టాయినిస్ హోల్డర్​ బౌలింగ్​లో ఔట్.

2019-06-06 16:48:23

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్. 79 పరుగుల వద్ద 19 పరుగులు చేసి స్టాయినిస్ హోల్డర్​ బౌలింగ్​లో ఔట్.

2019-06-06 16:41:55

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్. 79 పరుగుల వద్ద 19 పరుగులు చేసి స్టాయినిస్ హోల్డర్​ బౌలింగ్​లో ఔట్.

2019-06-06 16:30:28

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్. 79 పరుగుల వద్ద 19 పరుగులు చేసి స్టాయినిస్ హోల్డర్​ బౌలింగ్​లో ఔట్.

2019-06-06 16:24:37

ఐదో వికెట్​ కోల్పోయిన ఆసీస్

ఐదో వికెట్ కోల్పోయిన ఆసీస్. 79 పరుగుల వద్ద 19 పరుగులు చేసి స్టాయినిస్ హోల్డర్​ బౌలింగ్​లో ఔట్.

2019-06-06 16:07:23

ఆరు ఓవర్లలో 33/2

ఆరు ఓవర్లలో 33 పరుగులు చేసిన ఆస్ట్రేలియా. ఖవాజా (11), స్మిత్ (2) క్రీజులో ఉన్నారు
6వ ఓవర్: 0 0 0 1 0 0  (ఒక పరుగు)

2019-06-06 15:56:30

విండీస్ బ ౌలర్లు ఫైర్

బ్యాటింగ్​ ప్రారంభించిన ఆసీస్ నాలుగు ఓవర్లలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. ఫించ్ (6), వార్నర్ (3) విఫలమయ్యారు. థామస్, కాట్రెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

2019-06-06 15:43:33

వార్నర్ ఔట్

ఆస్ట్రేలియాకు షాక్ .26 పరుగుల వద్ద వార్నర్ ఔట్. 

2019-06-06 15:41:29

వెస్టిండీస్​కు ఇది 800వ వన్డే

ప్రపంచకప్​లో భాగంగా నేడు ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ తలపడుతోంది. ఈ వన్డే విండీస్​కు 800వది కావడం విశేషం.

2019-06-06 15:37:11

ఆట ప్రారంభం

ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మ్యాచ్​ ప్రారంభమైంది. ఆసీస్ ఓపెనర్లు వార్నర్, ఫించ్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు.

2019-06-06 15:33:41

వెస్డిండీస్

క్రిస్ గేల్, లూయిస్, షై హోప్ (కీపర్), నికోలస్ పూరన్, హెట్​మియర్, రసెల్, జాసన్ హోల్డర్ (సారథి), బ్రాత్​వైట్, అష్లే నర్స్, షెల్డన్ కాట్రెల్, ఒషానే సారథి

ఆస్ట్రేలియా

ఫించ్ (సారథి), వార్నర్, ఖవాజా, స్టీవ్ స్మిత్, మాక్స్​వెల్, స్టోయినిస్, అలెక్స్ కారే (కీపర్), నాథన్ కౌల్టర్​నీల్, కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడం జంపా

2019-06-06 15:25:01

ట్రెంట్​బ్రిడ్జ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచకప్​ మ్యాచ్​లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది.

2019-06-06 15:18:39

ట్రెంట్​బ్రిడ్జ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచకప్​ మ్యాచ్​లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది.

2019-06-06 15:12:23

ట్రెంట్​బ్రిడ్జ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచకప్​ మ్యాచ్​లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది.

2019-06-06 15:06:33

ట్రెంట్​బ్రిడ్జ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచకప్​ మ్యాచ్​లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది.

2019-06-06 15:03:08

ట్రెంట్​బ్రిడ్జ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచకప్​ మ్యాచ్​లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది.

2019-06-06 14:58:17

ట్రెంట్​బ్రిడ్జ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచకప్​ మ్యాచ్​లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది.

2019-06-06 14:44:04

జట్లు ఇవే

ట్రెంట్​బ్రిడ్జ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచకప్​ మ్యాచ్​లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది.

2019-06-06 14:26:55

టాస్ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న వెస్టిండీస్

ట్రెంట్​బ్రిడ్జ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచకప్​ మ్యాచ్​లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది.

Last Updated : Jun 6, 2019, 11:15 PM IST

ABOUT THE AUTHOR

...view details