తెలంగాణ

telangana

ETV Bharat / sports

'లారా రికార్డు బ్రేక్​ చేయాలంటే అతడికే సాధ్యం'​

పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో.. లారా పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డును అందుకునే అవకాశం కోల్పోయాడు ఆస్ట్రేలియా ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​. ఆ రికార్డుకు వార్నర్ 65 పరుగుల దూరంలో ఉన్నపుడు సారథి టిమ్​ పైన్​ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయడం వల్ల అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. తాజాగా ఆ అంశంపై మాట్లాడిన వార్నర్​.. ఆ రికార్డు సాధించే సత్తా ఒక్క బ్యాట్స్​మన్​కు మాత్రమే ఉందని చెప్పాడు.

aus-vs-pak-2019-australia-bastmen-david-warner-pick-up-rohit-name-to-break-lara-record-score-in-tests
లారా 400 బ్రేక్​ చేయాలంటే అతడికే సాధ్యం: వార్నర్​

By

Published : Dec 1, 2019, 2:06 PM IST

అడిలైడ్​ వేదికగా పాకిస్థాన్​తో జరుగుతున్న టెస్టులో తొలిసారి 300 పైగా వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు ఆసీస్​ బ్యాట్స్​మన్​ డేవిడ్​ వార్నర్​. ఈ మ్యాచ్​లో 335* పరుగులు(418 బంతుల్లో ; 39 ఫోర్లు, 1 సిక్సర్​) బాది అజేయంగా నిలిచాడు. అయితే ఇతడు మంచి ఫామ్​లో బ్యాటింగ్​ చేస్తుండగా.. లారా అత్యధిక వ్యక్తిగత పరుగుల (400) రికార్డుకు 65 పరుగుల దూరంలో ఆ జట్టు కెప్టెన్​ టిమ్​ పైన్​ ఇన్నింగ్స్​ డిక్లేర్​ ఇచ్చాడు.


ఫలితంగా వార్నర్.. లారా రికార్డు బ్రేక్​ అయ్యే అవకాశం కోల్పోయాడని అభిమానులు ఆసీస్​ సారథిపై తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా ఆ సంఘటనపై క్లారిటీ ఇచ్చాడీ ఓపెనర్. వర్షం పడుతుందనే సమాచారంతోనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. అనంతరం ఆ రికార్డు బ్రేక్​ చేసే సత్తా ఒక్క ఆటగాడికే ఉందని.. భారతీయ క్రికెటర్​ పేరు చెప్పాడు.

ఇతడికే సాధ్యం..

విండీస్​ దిగ్గజం బ్రియాన్​ లారా 400* పరుగుల మార్కును అందుకునే సత్తా టీమిండియా ఓపెనర్​ రోహిత్​శర్మకే ఉందని అభిప్రాయపడ్డాడు వార్నర్​. 2004లో ఇంగ్లాండ్​పై ఈ రికార్డు సృష్టించాడు లారా. దాదాపు 15 ఏళ్లయినా ఎవరూ ఆ మైలురాయిని చేరుకోలేకపోయారు.

ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టుల్లో ఓపెనర్​గా బరిలోకి దిగిన హిట్​మ్యాన్​.. వరుసగా రెండు శతకాలు, ఓ ద్విశతకం సాధించాడు. ప్రస్తతం టెస్టు బ్యాట్స్​మన్​ ర్యాంకింగ్స్​లో 13వ స్థానంలో ఉన్నాడు హిట్​మ్యాన్.

ABOUT THE AUTHOR

...view details