ఆస్ట్రేలియా ఓపెనర్ పకోస్కీపై ప్రశంసల జల్లు కురిపించాడు ఆ దేశ మాజీ సారథి రికీ పాంటింగ్. సిడ్నీ వేదికగా టీమ్ఇండియాతో జరుగుతోన్న మూడో టెస్టులో అతడు అద్భుత ప్రదర్శన చేశాడని కొనియాడాడు.
ఈ మ్యాచ్‌తో టెస్టు అరంగేట్రం చేసిన పకోస్కీ(62) ఓపెనర్‌గా బరిలో దిగి బౌండరీలతో చెలరేగిపోయాడు. దీనిని ఉద్దేశిస్తూ మాట్లాడిన పాంటింగ్.. "పకోస్కీ ఇన్నింగ్స్ చూసి నేను ముగ్ధుడయ్యా. భవిష్యత్తులోనూ మరింత బాగా ఆడగలడని తన అరంగేట్ర మ్యాచ్‌తోనే నిరూపించుకున్నాడు. అతడు స్టార్ ఆటగాడిగా ఎదుగుతాడనడానికి ఇదొక సంకేతం. గాయాలతో ఇంతకాలం బాధపడిన అతడికి మళ్లీ తానేంటో నిరూపించుకునేందుకు మంచి అవకాశం దొరికింది" అని తెలిపాడు.