మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టులో దూకుడుగా ఆడుతోన్న భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్‌కు గాయమైంది. దీంతో మ్యాచ్ మధ్యలోనే అతడు మైదానాన్ని వీడాడు.
మూడో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో తన నాలుగో ఓవర్ బౌలింగ్ వేస్తున్న సమయంలో ఉమేశ్ మోకాలికి దెబ్బ తగిలింది. వెంటనే అతడిని డ్రెసింగ్ రూమ్‌కు తరలించారు. తాను వేసిన రెండో ఓవర్లో జో బర్న్స్ వికెట్ తీసి టీమ్ఇండియాకు శుభారంభాన్ని అందించాడు ఉమేశ్.