సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో ఉత్కంఠ భరితంగా సాగిన రెండో టీ20లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది టీమ్ఇండియా. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ కైవసం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 194 పరుగులు చేసింది. మాథ్యూ వేడ్ (58; 32 బంతుల్లో, 10×4, 1×6) ఆకట్టుకున్నాడు.
రెండో టీ20లో భారత్ విజయం.. సిరీస్ కైవసం - ఆస్ట్రేలియా-భారత్ టీ20 అప్డేట్స్
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
రెండో టీ20లో భారత్ విజయం..సిరీస్ కైవసం
అనంతరం బరిలోకి దిగిన భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. శిఖర్ ధావన్ (52; 36 బంతుల్లో, 4×4, 2×6), హార్దిక్ పాండ్య (42*; 22 బంతుల్లో, 3×4 ,2×6), విరాట్ కోహ్లీ (40; 24 బంతుల్లో, 2×4, 2×6), కేఎల్ రాహుల్ (30; 22 బంతుల్లో, 2×4, 1×6) రాణించారు.
Last Updated : Dec 6, 2020, 5:33 PM IST