తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టెస్టు జెర్సీ ధరించడం గర్వంగా ఉంది'

ఐపీఎల్​లో సత్తాచాటిన పేసర్ నటరాజన్ అనతి కాలంలోనే టీమ్ఇండియా టెస్టు జట్టులోనూ చోటు సంపాదించాడు. తాజాగా టెస్టు జెర్సీ ధరించిన నట్టూ ఆ ఫొటోను నెట్టింట పంచుకున్నాడు.

By

Published : Jan 5, 2021, 10:58 AM IST

T Natarajan
'టెస్టు జెర్సీ ధరించడం గర్వంగా ఉంది'

ఐపీఎల్​లో సత్తాచాటిన యువ బౌలర్ నటరాజన్​ భారత జట్టులో చోటు సంపాదించాడు. తొలుత ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్​లో ఆడిన నటరాజన్.. టెస్టు జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. తాజాగా టీమ్ఇండియా టెస్టు జెర్సీ ధరించిన నట్టూ ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఈ జెర్సీ ధరించడం ఎంతో గర్వంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశాడు.

"తెలుపు (టెస్టు) జెర్సీ ధరించడం ఎంతో గర్వంగా ఉంది. భవిష్యత్ ఛాలెంజ్​లకు సిద్ధంగా ఉన్నా" అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు నట్టూ. ప్రస్తుతం మూడో టెస్టు కోసం నెట్స్​లో తీవ్రంగా శ్రమిస్తున్నాడీ పేసర్. ఈనెల 7 నుంచి సిడ్నీ వేదికగా ఈ టెస్టు జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details