ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు రోహిత్ శర్మను వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు. దీంతో అతడు మూడో టెస్టు ఆడటం లాంచనమే. జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇటీవల 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉన్న హిట్మ్యాన్.. జట్టుతో బుధవారం కలిశాడు. అనంతరం ప్రాక్టీసులో కూడా పాల్గొన్నాడు. రోహిత్ రావడం వల్ల జట్టు విజయావకాశాలు పెరగనున్నాయి. పితృత్వ సెలవులపై స్వదేశంలో ఉన్న కోహ్లీ లేని లోటును ఇతడు భర్తీ చేస్తాడని అభిమానులు భావిస్తున్నారు.