టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆస్ట్రేలియాతో మిగతా రెండు టీ20లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో పేసర్ శార్దూల్ ఠాకూర్ జట్టులోకొచ్చాడు. శుక్రవారం తొలి టీ20లో భారత ఇన్నింగ్స్ చివర్లో జడేజా బ్యాటింగ్ చేస్తుండగా అతడి తలకు బంతి తాకి కొంచెం ఇబ్బంది పడ్డాడు. ఫిజియో సాయం తీసుకోకుండానే అలాగే బ్యాటింగ్ కొనసాగించాడు. అనంతరం ఫీల్డింగ్‌కు మాత్రం రాలేదు.
జడేజా విషయంలో టీమ్ఇండియాకు ఎదురుదెబ్బ - జడేజాకు కంకషన్
హెల్మెట్‌కు బంతి తగిలి కంకషన్‌కు గురైన ఆల్‌రౌండర్ జడేజా.. ఆసీస్‌తో మిగతా టీ20లకు దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. శార్దుల్ ఠాకుర్‌ను అతడికి బదులుగా ఎంపిక చేసింది.
రవీంద్ర జడేజా
అతడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చిన చాహల్.. చక్కటి బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం చర్చనీయాంశమైంది. అయితే జడేజాను పరీక్షించిన బీసీసీఐ వైద్య బృందం.. అతడు కంకషన్‌తో బాధపడుతున్నట్లు ధ్రువీకరించి, శనివారం మరిన్ని పరీక్షలు చేయాలని నిర్ణయించింది.
ఇవీ చదవండి: