మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో జరగబోయే రెండో(బాక్సింగ్ డే) టెస్టుకు తుది జట్టును ప్రకటించింది టీమ్ఇండియా. సారథి కోహ్లీ గైర్హాజరీతో అజింక్యా రహానె తాత్కాలిక సారథిగా వ్యవహరించనున్నాడు. పుజారా వైస్ కెప్టెన్. మయాంక్ అగర్వాల్, శుభమన్ గిల్, హునుమ విహారి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, బుమ్రా, సిరాజ్ తుది జట్టులోకి ఉన్నారు.
గిల్, సిరాజ్ అరంగేట్రం.. రెండో టెస్టుకు జట్టిదే - ఆసీస్తో రెండో టెస్టుకు తుది జట్టు ప్రకటన
ఆసీస్తో రెండో టెస్టు కోసం టీమ్ఇండియా జట్టును ప్రకటించింది. ఈ మ్యాచుతో సిరాజ్, గిల్ టెస్టు అరంగేట్రం చేయనున్నారు.
![గిల్, సిరాజ్ అరంగేట్రం.. రెండో టెస్టుకు జట్టిదే AUS vs IND: India announce playing XI for Boxing Day Test](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10001301-808-10001301-1608878236276.jpg)
టీమ్ఇండియా తుది జట్టు ప్రకటన
వీరిలో గిల్, సిరాజ్ ఈ పోరుతోనే టెస్టు అరంగేట్రం చేయనున్నారు. ప్రస్తుతం 1-0తో ఆసీస్ సిరీస్ ఆధిక్యంలో ఉంది ఆసీస్. ఈ పోరులో గెలిచి 1-1సిరీస్ను సమం చేయాలని టీమ్ఇండియా పట్టుదలగా ఉంది.