టీమ్ఇండియాతో జరుగుతోన్న నిర్ణయాత్మక నాలుగో(చివరి) టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో గౌరవప్రదమైన స్కోరు సాధించింది. లబుషేన్(108) సెంచరీకి తోడు టిమ్ పైన్(50), గ్రీన్(47) రాణించడం వల్ల ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది.
గబ్బా టెస్టు: తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 369 ఆలౌట్ - ind vs aus fourth test second day
టీమ్ఇండియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైంది ఆస్ట్రేలియా. లబుషేన్(108) సెంచరీతో ఆకట్టుకున్నాడు. నటరాజన్, శార్దూల్, వాషింగ్టన్ సుందర్ ముగ్గురూ మూడేసి వికెట్లు తీసి రాణించారు.
ఓవర్‌నైట్ స్కోరు 274/5తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి సెషన్లోనే వరుస వికెట్లను కోల్పోయింది. తొలుత కెప్టెన్ టిమ్‌పైన్(50), శార్దుల్ ఠాకుర్ వేసిన ఓవర్‌లో స్లిప్‌లో రోహిత్ శర్మ చేతికి చిక్కాడు. తర్వాత ఓవర్‌లో కామెరూన్ గ్రీన్(47) వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అనంతరం శార్దుల్ వేసిన మరుసటి ఓవర్‌లో కమిన్స్(2) వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఆసీస్ 4 పరుగుల తేడాలో మూడు వికెట్లు కోల్పోయి.. 104 ఓవర్లకు ఆసీస్ 332/8తో నిలిచింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చి మిచెల్ స్టార్క్(16 ), నాథన్ లయన్(24), జోష్ హేజిల్వుజ్(11 ) స్కోరును ముందుకు పరుగెత్తించారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు తొలి సెషన్ పూర్తయ్యేసరికి 369 పరుగులు చేసి ఆలౌటైంది. నటరాజన్, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ ముగ్గురూ మూడేసి వికెట్లు తీయగా, సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది.