ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గాయం నుంచి త్వరగా కోలుకుంటున్నాడు. ఇందులో భాగంగానే టీమ్ఇండియాతో చివరి రెండు టెస్టుల కోసం అతడిని జట్టులోకి తీసుకున్నారు. ఈ మేరకు కొత్త టీమ్ జాబితాను విడుదల చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. జో బర్న్స్‌ను తప్పించిన ఆసీస్ సెలక్టర్లు వార్నర్‌కు స్థానం కల్పించారు. భారత్‌తో రెండో వన్డేలో గాయపడిన ఇతడు.. చివరి వన్డేతో పాటు తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడు.
వార్నర్ వేగంగా కోలుకుంటున్నాడని ఆస్ట్రేలియా సెలెక్టర్ ట్రెవర్ హోన్స్ ప్రకటనలో తెలియజేశాడు. మూడో టెస్టు జరగడానికి మరో ఏడు రోజులు ఉన్నందున అతడు కోలుకుని.. జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉందని తెలిపాడు.
టీమ్ఇండియాతో జరిగిన రెండో వన్డేలో గాయపడిన డేవిడ్ వార్నర్
విల్ పకోవ్‌స్కీ, మార్కస్ హారిస్‌లు ఆస్ట్రేలియా మరో ఓపెనింగ్ జోడీగా ఉన్నారు. టీమ్ఇండియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో పకోవ్‌స్కీ కంకషన్ గురయ్యాడు. దీనివల్లే రెండు టెస్టులకు దూరమయ్యాడు. అలానే మిగిలిన రెండు టెస్టుల కోసం సీన్ అబాట్ కూడా జట్టులోకి పునరాగమనం చేయనున్నాడని తెలుస్తోంది.
ఆస్ట్రేలియా టెస్టు జట్టు: టిమ్ పైన్ (కెప్టెన్), పాట్ కమిన్స్ (వైస్-కెప్టెన్), సీన్ అబాట్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, మార్కస్ హారిస్, ట్రావిస్ హెడ్, హెన్రిక్స్, లబుషేన్, లైయన్, మిచెల్ నీసర్, జేమ్స్ పాటిన్సన్, విల్ పకోవ్‌స్కీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వీప్సన్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్
ఇదీ చూడండి:సిడ్నీ టెస్టులో సంబరాలు బంద్