తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో సెషన్​ పూర్తి.. ఆసీస్ 65/2 - బాక్సింగ్ డే టెస్టు వార్తలు

టీమ్ఇండియాతో జరుగుతోన్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్​ బ్యాటింగ్ కొనసాగుతోంది. మూడో రోజు టీ బ్రేక్ సమయానికి 65/2 పరుగులు చేసింది ఆసీస్.

AUS vs IND: Australia score 65/2 at tea after India finish on 326
రెండో సెషన్​ పూర్తి.. ఆసీస్ 65/2

By

Published : Dec 28, 2020, 10:07 AM IST

Updated : Dec 28, 2020, 11:46 AM IST

టీమ్ఇండియాతో జరుగుతోన్న బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 28 ఓవర్లకు 65/2 పరుగులతో కొనసాగుతోంది. రెండో సెషన్‌ పూర్తయ్యేసరికి మాథ్యూవేడ్‌(27), స్టీవ్‌స్మిత్‌(6) క్రీజులో ఉన్నారు. ఇప్పటివరకు ఉమేశ్‌, అశ్విన్‌ చెరో వికెట్‌ తీశారు. ఆస్ట్రేలియా ఇంకా 66 పరుగుల వెనుకంజలో ఉంది.

రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆదిలోనే కంగారూల ఓపెనర్‌ జో బర్న్స్‌(4) ఔటయ్యాడు. ఉమేశ్‌ బౌలింగ్‌లో అతడు కీపర్‌ పంత్‌ చేతికి చిక్కాడు. ఆపై మార్నస్‌ లబుషేన్‌(27)ను అశ్విన్‌ బోల్తా కొట్టించాడు. దీంతో ఆ జట్టు 42 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. వేడ్‌, స్మిత్‌ ఇప్పటివరకు 23 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతకుముందు టీమ్‌ఇండియా 326 పరుగులకు ఆలౌటైంది.

Last Updated : Dec 28, 2020, 11:46 AM IST

ABOUT THE AUTHOR

...view details