తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అలా చేస్తే భారత ఓపెనింగ్ మరింత​ బలపడుతుంది' - టెస్టు సిరీస్​లో ఓపెరన్​గా కేఎల్​ రాహుల్​

ఆస్ట్రేలియాతో జరగబోయే టెస్టు సిరీస్​లో మయాంక్​తో పాటు ఓపెనర్​గా కేఎల్​ రాహుల్​ను​ పంపించాలని సూచించాడు భారత మాజీ క్రికెటర్​ ఆశిష్​ నెహ్రా. అతడికి అవకాశమివ్వడం వల్ల టీమ్​ఇండియా ఓపెనింగ్​ మరింత బలంగా తయారవుతుందని చెప్పాడు.

kl rahul
కేఎల్​ రాహుల్​

By

Published : Dec 14, 2020, 8:21 AM IST

సూపర్‌ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌కు సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ ఓపెనర్‌గా అవకాశమిస్తే టీమ్​ఇండియా ఓపెనింగ్ సమస్యలు తొలగిపోతాయని మాజీ క్రికెటర్ ఆశిష్ నెహ్రా సూచించాడు. ఐపీఎల్‌, ఆస్ట్రేలియాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో రాహుల్‌ సత్తాచాటాడు. అయితే అతడు గతేడాది ఆగస్టు నుంచి టెస్టు క్రికెట్‌ ఆడలేదు. మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో శుభ్‌మన్‌ గిల్‌, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్‌లో ఇద్దరికి ఓపెనర్లుగా అవకాశం వస్తుందని చర్చలు సాగుతుండటం వల్ల నెహ్రా తన అభిప్రాయాన్ని తెలిపాడు.

"టీమ్​ఇండియా ఓపెనర్ల గురించి చర్చ సాగుతోంది. మయాంక్ అగర్వాల్‌తో ఇన్నింగ్స్‌ ఆరంభించేది ఎవరని చర్చిస్తున్నారు. అయితే భారత్‌ ఓపెనింగ్‌ బలహీనంగా ఉందని చెప్పను. కానీ మయాంక్‌తో కలిసి శుభ్​మన్ గిల్​​, పృథ్వీ షా కాకుండా కేఎల్‌ రాహుల్‌తో ఓపెనింగ్ చేయించాలి. అతడు ప్రస్తుత ఫామ్‌ను కొనసాగిస్తూ పరుగులు చేస్తే టీమ్ఇండియా బలహీనత.. బలంగా మారుతుంది. మయాంక్ కూడా గత పర్యటనలో కీలక పరుగులు సాధించాడు. అంతేగాక వారిద్దరి మధ్య సమన్వయం గొప్పగా ఉంటుంది. గత ఏడాదిన్నరలో రాహుల్‌కు టెస్టుల్లో అవకాశమివ్వలేదు. కానీ ఇప్పుడు అతడు జట్టులో తప్పక ఉండాలి" అని నెహ్రా తెలిపాడు.

ఐపీఎల్‌లో పంజాబ్‌ తరఫున మయాంక్, కేఎల్ రాహుల్ భారీ భాగస్వామ్యాలు నెలకొల్పారు. కాగా, నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా డిసెంబర్‌ 17న అడిలైడ్ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా మధ్య తొలి డే/నైట్ టెస్టు జరగనుంది.

ఇదీ చూడండి : ర్యాంకింగ్స్​లో కోహ్లీ, కేఎల్ రాహుల్ పైపైకి

ABOUT THE AUTHOR

...view details