వన్డే సిరీస్ కోల్పోయినా సరే చివరి మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకొంది టీమ్ఇండియా. ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతోనే ఇప్పుడు టీ20 సిరీస్‌కు సిద్ధమవుతోంది. కాన్బెర్రా వేదికగా శుక్రవారం తొలి మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:40 గంటలకు ఈ పోరు ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల బలాబలాలు ఏంటో ఓ సారి పరిశీలిద్దాం.
కుర్రాళ్లతో భారత జట్టు సమతూకం!
వన్డే సిరీస్‌లో భారత్ ఓటమికి కారణాలు ఏమైనప్పటికీ, టీ20ల్లో మాత్రం కోహ్లీసేనకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల జరిగిన ఐపీఎల్లో జట్టులోని కుర్రాళ్లందరూ అద్భుతంగా రాణించారు. ఆ ఫామ్‌ను ఈ సిరీస్‌లో కొనసాగిస్తే మ్యాచ్‌లు గెలవడం పెద్ద కష్టమేమి కాదు.
వన్డేల్లో మిడిలార్డర్లో వచ్చిన కేఎల్ రాహుల్.. ఈ సిరీస్‌లో ధావన్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశముంది. నాలుగులో శ్రేయస్ అయ్యర్ లయను అందుకోవాలని యాజమాన్యం భావిస్తోంది. హార్దిక్ పాండ్యా, జడేజా.. బ్యాటుకు పనిచెప్పేందుకు సిద్ధమవుతున్నారు.