బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆదివారం తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని అర్ధాంతరంగా తనువు చాలించాడీ హీరో. 'ధోని' బయోపిక్‌లో క్రికెట్ ప్రేమికులంతా సుశాంత్‌లో మహీని చూసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సుశాంత్ మృతిపై ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ సంతాపం తెలిపాడు. 'ధోని: అన్‌టోల్డ్ స్టోరీ' చిత్రంలో ప్రేక్షకులంతా సుశాంత్ నటన చూసి మైమరచిపోయారని గుర్తు చేసుకున్నాడు.
సుశాంత్ రాజ్‌పుత్ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. ఇది ఒక విషాద ఘటన. 'ధోని' చిత్రంలో అచ్చం మహీలాగే నటించి సుశాంత్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు చిన్న వయసులో చనిపోవడం వల్ల ప్రపంచం ఓ మంచి నటుడ్ని కోల్పోయింది."