కరోనా నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ ఇప్పటికే వాయిదా పడే సూచనలు కనిపిస్తుండగా, ఆసియా కప్ జరుగుతుందా? లేదా? అనే సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన పాకిస్థాన్ బోర్డు సీఈఓ వసీమ్ ఖాన్.. కచ్చితంగా టోర్నీని నిర్వహిస్తామని అన్నారు. అయితే తమ దేశంలో జరగకపోవచ్చని కరాచీలో జరిగిన ఓ మీడియా కాన్ఫరెన్స్లో వెల్లడించారు.
"ఆసియా కప్ ఈ ఏడాది జరుగుతుంది. ఇంగ్లాండ్ నుంచి సెప్టెంబరు 2న పాకిస్థాన్, స్వదేశానికి తిరిగొస్తుంది. దీనిబట్టి సెప్టెంబరు, అక్టోబరులో టోర్నీని నిర్వహిస్తాం. శ్రీలంకలో తక్కువ కరోనా కేసులు ఉన్నందున అక్కడే ఆసియా కప్ జరపాలని భావిస్తున్నాం. వారు కాదంటే యూఏఈ సిద్ధంగా ఉంది" -వసీమ్ ఖాన్, పాక్ బోర్డు సీఈఓ