వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో ఆసియాకప్ జరగనుంది. ఆసియా కప్ పాక్‌లో జరగుతుండటం వల్ల భారత్ ఆడుతుందా లేదా? అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ విషయంపై పాక్ క్రికెట్ బోర్డు సీఈఓ వసీంఖాన్ స్పందించారు.టీమిండియా పాల్గొనే విషయంపై బీసీసీఐకి వచ్చే జూన్ వరకు గడువు ఇచ్చినట్టు తెలిపారు.
"టీమిండియా.. ఆసియాకప్ కోసం పాకిస్థాన్‌కు వచ్చేందుకు అంగీకరిస్తుందో లేదో చూడాలి. వచ్చే ఏడాది సెప్టెంబరు వరకు సమయం ఉంది. జూన్ వరకు వేచి చూస్తాం. ఎందుకంటే ఈ టోర్నీ నిర్వహణలో భారత్ ప్రమేయం చాలా ఉంది. ఇక్కడ నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్, ఐసీసీ నిర్ణయించాయి. ఇందులో భారత్ పాల్గొంటుందని మేం ఆశిస్తున్నాం." -వసీం ఖాన్, పీసీబీ సీఈఓ
అదే విధంగా భారత్‌తో దైపాక్షిక సిరీస్ జరిపేందుకు ఆచరణాత్మక సమస్యలు ఉన్నాయని అంగీకరించారు ఖాన్.