ఈ ఏడాది సెప్టెంబరులో దుబాయ్ వేదికగా ఆసియాకప్ జరుగుతుందని, టీమిండియా, పాకిస్థాన్లు ఇందులో పాల్గొంటాయన్నాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. శుక్రవారం ఈ విషయంపై స్పష్టతనిచ్చాడు. ఇప్పుడిదే అంశంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధ్యక్షుడు ఎహెసన్ మణి మాట్లాడాడు. ఈ టోర్నీ గురించి తాము ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పాడు. ఆసియా దేశాల అసోసియేటివ్ సభ్యులతో జరిగే భేటీలో అంతిమ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాడు.
"ఆసియాకప్ నిర్వహణపై అంతిమ నిర్ణయం, అసోసియేటివ్ దేశాలతో చర్చించిన తర్వాతే తీసుకుంటాం"
-ఎహెసన్ మణి, పీసీబీ అధ్యక్షుడు