ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020కి మరో నెల రోజులే ఉంది. సమయం దగ్గర పడటం వల్ల ఫ్రాంఛైజీలు తమ ఆటగాళ్లను ప్రత్యేక విమానాల్లో దుబాయ్‌కు పంపిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇప్పటికే యూఏఈలో అడుగుపెట్టాయి. దిల్లీ క్యాపిటల్స్ సహా మరికొన్ని జట్లు ఈ రోజు పయనమవుతున్నాయి.
కరోనా వైరస్ ముప్పు పొంచి వుండటం వల్ల ఫ్రాంఛైజీలు అనేక చర్యలు తీసుకున్నాయి. ఆటగాళ్లకు పీపీఈ కిట్లు అందించాయి. శానిటైజర్లు, సబ్బులతో కూడిన ప్రత్యేక కిట్‌ను ఇచ్చాయి. రెండు కన్నా ఎక్కువసార్లే ఆర్‌టీ పీసీఆర్ టెస్టులు చేయించాయి. చెన్నై, బెంగళూరు, ముంబయి, దిల్లీ వంటి నగరాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి ఆటగాళ్లను మొదట అక్కడకు రప్పించాయి. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో దుబాయ్‌కు పంపించాయి. ఈ నేపథ్యంలో క్రికెటర్లకు కుటుంబ సభ్యులు జాగ్రత్తలు చెప్పారు.