లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్ టిక్‌టాక్‌లో సందడి చేస్తున్నాడు. ప్రతి రోజూ తన భార్య, పిల్లలతో కలిసి భారతీయ సినిమా పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ.. ఇన్‌స్టా, ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే, చైనా మొబైల్ యాప్స్‌ను నిషేధిస్తూ.. సోమవారం భారత్ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ.. "అయ్యో? డేవిడ్ వార్నర్" అంటూ సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమా 'బాషా' డైలాగ్‌తో చమత్కరించాడు.
'అయ్యో వార్నర్ 'టిక్‌టాక్' బ్యాన్ చేశారు.. ఇపుడెలా' - క్రికెట్ తాజా వార్తలు
భారత్‌లో టిక్‌టాక్‌ను నిషేధిస్తూ సోమవారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను.. టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్ సరదాగా ట్రోల్ చేశాడు.
అయ్యో వార్నర్ 'టిక్‌టాక్' బ్యాన్ చేశారు:అశ్విన్
గల్వాన్ లోయ వద్ద ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. చైనా-భారత్ ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ భద్రత సమస్యల దృష్ట్యా చైనాకు చెందిన టిక్‌టాక్, వీచాట్, యుసి బ్రౌజర్ సహా 59 యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించింది.
ఇదీ చూడండి:నాకు కరోనా వచ్చిందని తెలియదు: బోథమ్