చెన్నై టెస్ట్‌లో 5 వికెట్లతో ఆకట్టుకున్న భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. సొంతగడ్డపై అత్యధిక వికెట్లు తీసిన టీమ్ఇండియా ఆటగాళ్లలో మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్(265)ను వెనక్కి నెట్టి.. రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్‌ను ఔట్ చేసి ఈ ఫీట్ సాధించాడు అశ్విన్. భజ్జీ 28.76 సగటుతో ఈ ఘనత దక్కించుకోగా.. అశ్విన్ కేవలం 22.67(266 వికెట్లు)సగటుతోనే ఈ రికార్డును అందుకోవడం విశేషం.
చెన్నై టెస్ట్‌లో అశ్విన్ మరో రికార్డు - Highest test wicket takers in India
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత స్పిన్నర్ మరో మైలురాయిని అందుకున్నాడు. స్వదేశీ గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్లలో మాజీ స్పిన్నర్ హర్భజన్‌ను వెనక్కినెట్టి.. రెండో స్థానానికి చేరాడు.
ఈ జాబితాలో 350 వికెట్ల(సగటు 24.88)తో అగ్రస్థానంలో ఉన్నాడు మాజీ దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే. ఓవరాల్‌గా 619 వికెట్లు నేలకూల్చిన కుంబ్లే.. అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో కపిల్ దేవ్-434, హర్భజన్-417 ఉన్నారు. ఇప్పటికే 400 వికెట్లకు చేరువైన అశ్విన్.. ప్రస్తుత ఫామ్ ప్రకారం చూస్తే త్వరలోనే భజ్జీ, కపిల్‌ను అధిగమించేందుకు ఎక్కువ కాలం పట్టకపోవచ్చు.
ఇదీ చదవండి:చెన్నై టెస్ట్‌లో తిప్పేసిన భారత్- ఇంగ్లండ్ 134 ఆలౌట్