ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్లే క్రికెటర్లు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటారని తాను చిన్నతనంలో అనుకునేవాడినని చెప్పాడు టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్. అంతకుముందు ఈ విషయమై అంతర్జాతీయ క్రికెట్ మండలి ట్విట్టర్లో ప్రశ్నించగా, బదులుగా ఇలా సమాధానమిచ్చాడు అశ్విన్. ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది.
మీ చిన్నతనంలో క్రికెట్ పట్ల ఎలాంటి అపోహలు ఉండేవి? అని ఐసీసీ ట్వీట్ చేసింది. దీనికి అశ్విన్‌తో పాటు పలువురు క్రికెటర్లు సమాధానాలు ఇచ్చారు.